Srikanth Iyengar: 54 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. బిగ్ బాస్ నటి జ్యోతితో కలిసి ఏడడుగులు!

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన శ్రీకాంత్ అయ్యంగార్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అది కూడా 54 ఏళ్ల వయసులో. ఆయన పెళ్లి చేసుకోనున్నది మరెవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి. తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

Srikanth Iyengar: 54 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. బిగ్ బాస్ నటి జ్యోతితో కలిసి ఏడడుగులు!
Srikanth Iyengar, Jyothi
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2024 | 3:56 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగర్ ఒకరు. కమెడియన్, విలన్, సహాయక నటుడి పాత్రలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నారాయన. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలతో శ్రీకాంత్ అయ్యంగర్ బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన నటించిన పొట్టేల్ సినిమా ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్. జర్నలిస్టులు, రివ్యూయర్లను బూతులు తిట్టారు. దీంతో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై మండి పడ్డాయి. దీంతో దిగివచ్చిన అయ్యంగర్ వారికి క్షమాపణలు చెప్పాడు. ఇలా నిత్యం సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోన్న శ్రీకాంత్ అయ్యంగర్ ఇప్పుడు ఆడియెన్స్ కు మరో షాక్ ఇచ్చారు. ప్రముఖ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి తో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తనకు జ్యోతి ముద్దు పెడుతోన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. ‘క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?’ అంటూ క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చారు.

శ్రీకాంత్ అయ్యంగర్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజనలు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది శ్రీకాంత్, జ్యోతిలకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ అయ్యంగర్ పోస్ట్ .. ఇదిగో..

కాగా తెలుగులో 20కు పైగా సినిమాల్లో నటించాడు శ్రీకాంత్ అయ్యంగర్. 2014లో బసంతి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కరోనా వైరస్, దిశ ఎన్ కౌంటర్, మర్డర్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు.  ఈ ఏడాది ఆయన నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఆయన డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ లాగానే శ్రీకాంత్ అయ్యంగర్ ఏదైనా సూటిగా మాట్లాడుతాడు.  అది తన సోషల్ మీడియా పోస్టుల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా పొట్టేల్ సినిమా ఫంక్షన్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

పొట్టేల్ సినిమా లో శ్రీకాంత్  అయ్యంగర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే