Ayalaan Movie: శివకార్తికేయన్ ‘అయాలన్’ కోసం ఆ స్టార్ హీరో.. ఏలియన్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?..

ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివకార్తికేయన్ జోడిగా రాహుల్ ప్రెత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పోస్టర్స్, టీజర్ కు జనాల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఏలియన్ పాత్ర చుట్టూ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2018లోనే స్టార్ట్ అయ్యింది. దాదాపు 50 రోజులు పట్టాల్సిన సన్నివేశాలు చిత్రీకరించలేదు.

Ayalaan Movie: శివకార్తికేయన్ 'అయాలన్' కోసం ఆ స్టార్ హీరో.. ఏలియన్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?..
Ayalaan Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 13, 2023 | 3:22 PM

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‏కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రెమో సినిమాతో టాలీవుడ్ అడియన్స్‏కు దగ్గరయ్యాడు. ఇటీవలే ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా అయాలన్. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివకార్తికేయన్ జోడిగా రాహుల్ ప్రెత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన పోస్టర్స్, టీజర్ కు జనాల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఏలియన్ పాత్ర చుట్టూ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2018లోనే స్టార్ట్ అయ్యింది. దాదాపు 50 రోజులు పట్టాల్సిన సన్నివేశాలు చిత్రీకరించలేదు. మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టిందని దర్శకుడు రవికుమార్ తెలిపారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించింది అయాలన్.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరో శివకార్తికేయన్, అయాల్ అనే ఏలియన్ మధ్య స్నేహం.. ఏలియన్ రాకతో హీరో జీవితంలో ఎదురైన సంఘటలను చూపించనున్నారు. ఇందులో ఏలియన్ పాత్రకు ఓ ప్రముఖ హీరో గాత్రధానం చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అతను ఎవరో కాదు.. టాలీవుడ్ సక్సెస్ హీరో సిద్ధార్థ్. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్.. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే చిన్నా సినిమాతో అడియన్స్ ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ సిద్థార్థ్ నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు శివకార్తికేయన్ నటిస్తోన్న అయాలన్ సినిమాలోని ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్తున్నారట సిద్ధార్థ్.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని డిసెంబర్ 26న క్రిస్మస్ స్పెషల్ గా నిర్వహించాలని అయాలన్ టీమ్ ప్లాన్ చేసింది. సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం మొదటి సారి కాదు. ఇప్పటికే నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సిద్థార్థ్.. అటు ప్లే బ్యాక్ సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడారు. 2019లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా లయన్ కింగ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు సిద్ధార్థ్ స్వయంగా సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. ఈ డబ్బింగ్ అతని దృష్టిని చాలా ఆకర్షించింది. ఇప్పుడు శివకార్తికేయన్‌తో సినిమా అంతా ట్రావెల్ చేయనున్న అయాలాన్‌కి ఇప్పుడు సిద్ధార్థ్ వాయిస్‌ని అందించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియజేసింది. సిద్ధార్థ్ వాయిస్‌కి ప్రత్యేకమైన వైబ్ ఉంది. దీంతో ఇప్పుడు శివకార్తికేయన్ ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.