- Telugu News Photo Gallery Cinema photos Tollywood senior heroes reduced the speed of of to get good results with movies
Senior Heroes: జోరు తగ్గించిన టాలీవుడ్ సీనియర్ హీరోలు.. ఇప్పుడైనా మంచి ఫలితాలు అందుతాయా..
స్టార్ హీరోలు సిక్స్ టీ ప్లస్‌లో ఉంటే, సిల్వర్ స్క్రీన్ మీద జోరు చూపించడంలో స్లో అవుతారా? మన దగ్గర ఆ నలుగురు చూపిస్తున్న జోరు ఎలా ఉంది? పొరుగు భాషల్లో వారి పరిస్థితి ఏంటి? కమాన్ సీనియర్ హీరోలతో సౌత్ టూర్ చేసొద్దాం. నా సామి రంగలో నాగార్జున సాంగ్ చూసిన వారందరూ ఈ సంక్రాంతికి నాగ్ బౌన్స్ బ్యాక్ అవుతారనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. రీ ఎంట్రీ తరువాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Dec 13, 2023 | 3:29 PM

నా సామి రంగలో నాగార్జున సాంగ్ చూసిన వారందరూ ఈ సంక్రాంతికి నాగ్ బౌన్స్ బ్యాక్ అవుతారనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. 2024 పొంగల్‌కి నాగ్ మీద మాత్రమే కాదు, వెంకీ మీద కూడా చాలా ఆశలే పెట్టుకుంటున్నారు జనాలు. రీసెంట్‌గా డాటర్ సెంటిమెంట్‌తో వచ్చి న హాయ్ నాన్న క్లాస్ ఆడియన్స్‌తో మంచి రిసెప్షన్ వచ్చింది. దీంతో సైంధవ్ మీద కూడా హోప్స్ పెరిగాయి. నా సామిరంగ, సైంధవ్ హిట్ అయితే, ఈ ఇద్దరు హీరోలు స్పీడ్ పెంచే అవకాశం పుష్కలంగా ఉంది.

రీ ఎంట్రీ తరువాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భారీ హిట్స్ వస్తున్నా ఫెయిల్యూర్స్ కూడా ఇబ్బంది పెడుతుండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సినిమాకి సినిమాకి మధ్య చాలా గ్యాప్ వస్తోంది. భోళా శంకర్ తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్న మెగాస్టార్, ఇప్పుడు వశిష్ట సినిమాతో బిజీగా ఉన్నారు.

టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్న హీరో బాలయ్య. ప్యారలల్‌గా రెండు మూడు సినిమాలు చేయకపోయినా.. ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు నందమూరి నటసింహం.

అయితే అదర్ లాంగ్వేజ్ సీనియర్స్‌తో పోల్చుకుంటే మన హీరోలు చూపిస్తున్న స్పీడు మాత్రం ఆ రేంజ్‌లో లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రజెంట్ కోలీవుడ్‌లో సీనియర్స్ జోరే ఎక్కువగా కనిపిస్తోంది. విక్రమ్‌తో కమల్, జైలర్‌తో రజనీకాంత్ బ్యౌన్స్ బ్యాక్ అయ్యారు. అదే జోరులో వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నారు. ప్రజెంట్ ఈ ఇద్దరు హీరోల చేతిలో చెరో అరడజను సినిమాలు ఉన్నాయి.

ఇక మాలీవుడ్ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వాళ్లు ఎప్పుడు చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంటారు.





























