Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 Movie: ఇట్స్ అఫీషియల్.. ఇండియన్ 2లో సిద్ధార్థ్.. అనౌన్స్ చేసిన మేకర్స్..

శంకర్.. కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. అయితే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం.. నిర్మాణ సంస్థతో మనస్పర్థలు రావడంతో ఈ సినిమా కొద్ది రోజులు ఆగిపోయింది. అయితే కమల్ చొరవ తీసుకుని ఇరువురి మధ్య విభేదాలను తొలగించడంతో కొన్ని నెలల క్రితం ఈ మూవీ తిరిగి ప్రారంభమైంది.

Indian 2 Movie: ఇట్స్ అఫీషియల్.. ఇండియన్ 2లో సిద్ధార్థ్.. అనౌన్స్ చేసిన మేకర్స్..
Siddharth Birthday
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2023 | 1:27 PM

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ చేయకముందు శంకర్.. కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. అయితే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం.. నిర్మాణ సంస్థతో మనస్పర్థలు రావడంతో ఈ సినిమా కొద్ది రోజులు ఆగిపోయింది. అయితే కమల్ చొరవ తీసుకుని ఇరువురి మధ్య విభేదాలను తొలగించడంతో కొన్ని నెలల క్రితం ఈ మూవీ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈరోజు సిద్ధూ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. సిద్దార్థ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.