SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాలో కట్టప్ప స్పెషల్ రోల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సత్యరాజ్..

మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా .. ? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ఈ మూవీ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు జక్కన్న. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాలో కట్టప్ప స్పెషల్ రోల్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సత్యరాజ్..
Satyaraj, Rajamouli, Mahesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 01, 2024 | 7:12 AM

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం వరల్డ్ వైడ్ అడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈసారి జక్కన్న ఎలాంటి సినిమా తెరకెక్కించనున్నాడు అనే విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్. అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుందని.. అది కూడా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాబోతుందని ఇదివరకే జక్కన్న ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా .. ? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ఈ మూవీ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు జక్కన్న. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఇక గతవారం రోజులుగా మహేష్, జక్కన్న ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది. ఈ సినిమాలో బాహుబలి కట్టప్ప అలియాస్ నటుడు సత్యరాజ్ కీలకపాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యరాజ్ ను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేశాడు. డైరెక్టర్ రాజమౌళికి తాను ఎంతో రుణపడి ఉన్నానని.. దక్షిణాదిలో అందరూ తనను సత్యరాజ్ గా గుర్తుపడతారని.. కానీ బాహుబలి తర్వాత ప్రపంచం మొత్తానికి తనను కట్టప్పగా పరిచయం చేసింది డైరెక్టర్ రాజమౌళి అని అన్నారు. ఇక యానిమేషన్ సిరీస్ రావడంతో చిన్నారు తనను ఇలాగే గుర్తుపడతారని అన్నారు. బాహుబలి సినిమాలో తనకు కండలు ఉన్నట్లుగా చూపించారని.. ఇక యానిమేషన్ సిరీస్ లో ఇంకాస్త ఎక్కువే చూపించారని.. దీంతో బయట కూడా తాను అలాగే ఉంటానని పిల్లలు అనుకుంటారని అన్నాడు.

రాజమౌళి, మహేష్ సినిమాలో పాత్ర కోసం తనను ఎవరు సంప్రదించలేదని.. ఒకవేళ ఛాన్స్ వస్తే ఆ సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు. అలాగే కొన్ని రోజులుగా వినిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ వార్తలపై స్పందించారు. మోదీ బయోపిక్ లో తాను నటించడం లేదని.. కొంచెం మోదీలా కనిపిస్తానని.. ఎవరో ఇద్దరి ఫోటోలను పక్కన పెట్టి అలా పిక్స్ సెట్ చేశారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.