Sathyadev: నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో సత్యదేవ్..
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు హీరో సత్యదేవ్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం గాడ్సే. ఈ చిత్రానికి గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్రయూనిట్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ఆది పురుషుడు అంటే కె.ఎస్.రామారావుగారే. ఆయన స్టార్ట్ చేసిన ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌గారు టేకప్ చేసి పూర్తి చేశారు. గాడ్సే సినిమా గురించి మాట్లాడే సందర్భంలో గోపి అన్న గురించి చెప్పాలి. ఆయన్ని చూస్తే హిస్టరీ, ఫిజిక్స్ పాఠాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా కదలకుండా అలా నిల్చుంటాడు. నన్ను నా కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి. ఆయన మీద కంటే నామీదనే తనకు ఎక్కువ కాన్ఫిడెన్స్. ఫిల్మ్ స్టోరి చెప్పినప్పుడు నేను చేయగలనా! అన్నాను. ఇది పెద్ద స్టార్ చేయాల్సిన సినిమా నాకు ఓకేనా అన్నాను. మనం సంధించే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఆలోచన పుట్టించిందంటే చాలు డార్లింగ్. నువ్వు చెయ్యగలవు అని నాకు చెప్పి ఒప్పించారు. నేను-గోపి అన్న, సోసైటీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం.
చిన్న సమస్యలనీ మనం వదిలేస్తుంటాం. కానీ అవే పెద్ద సమస్యలు. నాలో, తనలో చాలా ఎందుకు అనే ప్రశ్నలుంటాయి. యూత్ ఫిల్మ్ చేయవచ్చు కదా.. లవ్ స్టోరిలాంటిది అంటుంటారు. గాడ్స్ ఓ యూత్ ఫిల్మ్. లవ్ స్టోరినే కాదు.. గాడ్సే అనేది యూత్ కోసం చేసిన సినిమా. కళ్యాణ్‌గారు ప్రొడ్యూస్ చేసిన జ్యోతీలక్ష్మీ లీడ్ యాక్టర్‌గా నేను నటించిన చిత్రం. మళ్లీ మరోసారి ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. శాండీ, సునీల్ కశ్యప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మీమీనన్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇద్దరం కలిసి నటించలేదు. సినిమాలో ఇద్దరం డిజిటల్ మీడియంతోనే మాట్లాడుకుంటాం. తను అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. సురేష్ సారంగం అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. జూన్ 17న గాడ్సే వస్తుంది. అందరూ సినిమా చూడండి.. అందరిలో ఓ ఆలోచన వస్తుంది’’ అన్నారు.