Chor Bazaar Trailer: పూరీ తనయుడి కోసం రంగంలోకి బాలయ్య.. చోర్ బజార్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో..

మెహబుబా, రొమాంటిక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చోర్ బజార్.

Chor Bazaar Trailer: పూరీ తనయుడి కోసం రంగంలోకి బాలయ్య.. చోర్ బజార్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో..
Chor Bazaar Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2022 | 5:02 PM

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తంపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో ఆకాష్. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. మెహబుబా, రొమాంటిక్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చోర్ బజార్. జార్చ్ రెడ్డి, దళం వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆకాష్ సరనస గెహన సిప్పీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు.

ఈ మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా గురువారం సాయంత్రం బాలయ్య విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో హీరో బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో ఆకాష్ పూరి మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాయి. ఇందులో ఆకాష్ పూరి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్‌ నటి అర్చన, సునీల్‌, సంపూర్ణేశ్‌ బాబు తదితరులు కీలకపాత్రలలో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసింది.