Ravi Mohan: ‘డబ్బు, పవర్ కాదు.. ఆ మూడో వ్యక్తి వల్లే మేం విడిపోయాం’.. స్టార్ హీరో భార్య మరో సంచలన పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), ఆయన సతీమణి ఆర్తి రవి మధ్య విడాకుల వ్యవహారం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే విడిగా ఉంటున్న వీరిద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

తమిళ స్టార్ హీరో జయం రవి కుటుంబ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు గతేడాది హీరో రవి మోహన్ ప్రకటించాడు. అయితే విడాకుల గురించి తనని ఒక్కసారైనా సంప్రదించలేదని ఆర్తి ఆరోపిస్తోంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. దీనిపై త్వరలోనే తీర్పు రానుంది. అయితే ఈ కేసు ఓ కొలిక్కి రాకుండానే జయం రవి, భార్య ఆర్తి, సింగర్ కెనీషా (రవి మోహన్ ప్రియురాలిగా ప్రచారం జరుగుతోంది) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే ఈ వ్యవహారంపై ఆర్తి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కాస్త ఘాటుగా స్పందించింది. అల్లుడు రవి మోహన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆర్తి సోషల్ మీడియాలో మరో సుదీర్ఘ పోస్ట్ ను షేర్ చేసింది. అందులో భర్త రవి మోహన్, సింగర్ కెనీషాలపై సంచలన ఆరోపణలు చేసింది. ‘మేము విడిపోవడానికి డబ్బు లేదా పవర్ కారణం కాదని అందరికీ తెలుసు. మా మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి సంబంధం) కారణంగానే మేం విడిపోయాం. ఈ విషయంపై నేను ఎలాంటి ఊహాగానాలు మాట్లాడడం లేదు. దీనికి నా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి.
’18 ఏళ్లు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా దూరమయ్యారు. ప్రస్తుతం పిల్లల బాధ్యత నా భుజాలపైనే ఉంది. నేను మాట్లాడకపోవడం నా నిజాయితీ కోసమే. అతని కెరీర్ కోసం 15 ఏళ్లుగా నా కలలు, నా మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశాను. జీవితాంతం నాతోనే ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ, ఇప్పుడు మాట తప్పాడు. ఒకవేళ అతడిని నేను పట్టించుకోకపోయి ఉంటే ఉన్నతంగా జీవించే దాన్ని. ఆర్థిక నిర్ణయాలన్నీ మేం కలిసే తీసుకున్నాం. అందుకు సంబంధించిన రికార్డులు కూడా నా వద్ద ఉన్నాయి. వాటిని అవసరమైనప్పుడు కోర్టులో సమర్పిస్తాను. ఈ విషయంలో అన్ని నిజాలు తెలిసిన ఏకైక వ్యక్తి నా భర్త. నేను బలహీనవంతురాలిని కాదు. ఇకపై ఏం చెప్పను. ఎందుకంటే న్యాయస్థానంపై నాకు నమ్మకం ఉంది. నాపై ప్రేమ చూపిస్తున్న మీడియా, సోషల్ మీడియా, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని తన పోస్టులో పేర్కొంది ఆర్తి. మరి దీనిపై రవి మోహన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఆర్తి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








