Tollywood: చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్స్.. దెబ్బకు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.. కానీ నెట్టింట చూస్తే..
సినీరంగంలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. దీంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. కెరీర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించిన అమ్మాయి.. ఆ తర్వాత హీరోయిన్గా మారింది. వరుస సినిమాలతో ఇటు తెలుగు, అటు తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి నాట్యమయూరి ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. చూడచక్కని రూపం, ఆకట్టుకునే కళ్లు.. అందమైన చిరునవ్వుతో అడియన్స్ హృదయాలను దొచేసింది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తెలుగులో ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్.
తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో జన్మించిన ఈ అమ్మడు.. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కానీ నటనపై ఆసక్తి ఉండడంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ తొలి నాళ్లల్లో అంతగా అవకాశాలు అందుకోలేదు. దీంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. దాదాపు పదేళ్లుగా సినీరంగంలో నటిగా కొనసాగుతున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో అలరించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటోస్ అప్లోడ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చిన్నప్పటి భరతనాట్యం ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..




