Ram Pothineni: వెన్నుముకకు గాయం అయ్యింది.. ఫస్ట్ టైమ్ నిస్సహాయస్థితిలోకి వెళ్లాను.. హీరో రామ్ ఎమోషనల్ స్పీచ్..
ఇందులో మొదటిసారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈమూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది.
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రధాన పాత్రలో డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ది వారియర్. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇందులో మొదటిసారి రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈమూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న భారీ ఎత్తున సినిమా విడుదలఅవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ఉస్తాద్ రామ్ ది వారియర్ జర్ని గురించి చెప్పుకొచ్చారు.
రామ్ మాట్లాడుతూ ”ఈ సినిమా జర్నీ డిఫరెంట్‌గా స్టార్ట్ అయ్యింది. పోలీస్ కథ చేద్దామనుకున్నాను. ఐదు కథలు విన్నాను. అన్నీ ఒకేలా అనిపించి కొన్ని రోజులు పోలీస్ కథలు వద్దని, వినకూడదని అనుకున్న టైమ్‌లో లింగుస్వామి గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పోలీస్ కథ అని చెప్పలేదు. వచ్చాక చెప్పారు. ఫార్మాలిటీ కోసం విందామని అనుకున్నాను. విన్న తర్వాత… పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. నేను స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడూ ట్వీట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు ట్వీట్ చేశా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ రాశానని ఆయన చెప్పారు. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు.
జీవితంలో మన కంట్రోల్‌లో ఉన్న పనులు చేస్తాం. లేనివి దేవుడికి వదిలేస్తాం. జీవితంలో ఒకటి సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్లొచ్చని పోలీసుల కథలు విన్న తర్వాత అనిపించింది. ‘ది వారియర్’ నాకు చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఫస్ట్ టైమ్ ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాను. పోలీస్ రోల్ కోసం ప్రిపేర్ కావడానికి ఒక నెల టైమ్ ఉంది. వర్కవుట్స్ చేద్దామని జిమ్‌కు వెళ్ళా. రోజుకు రెండుసార్లు జిమ్ చేద్దామనుకుంటే… స్పైనల్ కార్డ్ దగ్గర ఇంజురీ అయ్యింది. మూడు నెలలైనా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళా. వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా? జిమ్‌కు వెళ్ళొచ్చా? అంటే… వన్ కిలోతో చేయొచ్చని చెప్పారు. అలా అయితే కష్టమని చెప్పా. అప్పుడు ‘మీకు సినిమా ఇంపార్టెంట్ ఆ? లైఫ్ ఇంపార్టెంట్ ఆ?’ అని డాక్టర్ ప్రశ్నించారు. సినిమానే లైఫ్ అనుకునేవాళ్ళకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్‌లా అనిపిస్తుంది.
ఇంటికి వచ్చేశా. చాలా రోజుల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేశా. అప్పుడు అభిమానులు పంపిన సందేశాలు ఒక్కొక్కటీ చదివా. నేను అప్పటివరకూ సాంగ్స్, ఫైట్స్ ఎలా చేయాలని ఆలోచించా. ‘అన్నా… నువ్వేం చేయకు. ఈ సినిమాకు మేం ఏమీ ఆశించడం లేదు’ అని ఫ్యాన్స్ మెసేజ్ చేశారు. ‘ఇదీ అన్ కండిషనల్ లవ్’ అని అప్పుడు అనిపించింది. అభిమానులు లేకపోతే నేను లేనని ఆ రోజు అర్థమైంది. థాంక్యూ సో మచ్. నా బాడీలోని ప్రతి ఇంచ్ లో ఎనర్జీ మీ వల్లే వచ్చింది. ఈ సినిమా నాకు చాలా నేర్పింది” అని అన్నారు.