Liger Movie: ‘అక్‌డి పక్‌డి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మాస్ స్టెప్పులతో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ..
Akdi Pakdi Song: ‘అక్‌డి పక్‌డి’ ఫుల్ సాంగ్‌లో విజయ్, అనన్య మాస్ స్టెప్పులతో రచ్చ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇందులో విజయ్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
Akdi Pakdi Song: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ (Liger) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లైగర్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవల విడుదలైన ‘అక్‌డి పక్‌డి’ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌ను షేక్ చేసింది. అనన్య పాండే, విజయ్ దేవరకొండ మధ్య ఈ పార్టీ సాంగ్‌కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘అక్‌డి పక్‌డి’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రూయనిట్.
‘అక్‌డి పక్‌డి’ ఫుల్ సాంగ్‌లో విజయ్, అనన్య మాస్ స్టెప్పులతో రచ్చ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇందులో విజయ్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఇక ప్రస్తుతం ఈరోజు విడుదలైన ‘అక్‌డి పక్‌డి’ పాటకు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించగా.. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. హిందీలో మోహ్‌సిన్ షైక్, అజీమ్ దయాని అందించగా లిజియో జార్జ్ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.
కరణ్ జోహార్, ఛార్మి, పూరి సంయుక్తంగా ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లుపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీలో మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తుండడంతో లైగర్ సినిమా పై హైప్ ఎక్కువగానే ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.