Prabhas: మరోసారి సాహసం చేస్తోన్న యంగ్ రెబల్ స్టార్.. మారుతి సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నారా ..

అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ మూవీలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడట.

Prabhas: మరోసారి సాహసం చేస్తోన్న యంగ్ రెబల్ స్టార్.. మారుతి సినిమాలో ప్రభాస్ అలా కనిపించనున్నారా ..
Prabhas
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:17 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న రెబల్ స్టార్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమా చిత్రీకరణలలో పాల్గొంటున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సాహసం చేసేందుకు సిద్దమయ్యారట. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ మూవీలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హారర్ కామెడీ నేపథ్యంలో ఈ మూవీ రాబోతుందని.. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో ప్రభాస్ తాతగా.. అలాగే మనవడిగా రెండు రోల్స్ చేయనున్నారని టాక్. అంతేకాకుండా మారుతీ తన కామెడీ టైమింగ్ ప్రదర్శఇంచడానికి తగినంత స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. సలార్ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ప్రాజెక్ట్ కే సినిమాలో అమితాబ్, దీపిక పదుకొణే కీలకపాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే త్వరలోనే స్పిరిట్ చిత్రం పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!