RRR Movie: ఆర్ఆర్ఆర్ క్రేజ్ తగ్గట్లేదుగా.. అల్లూరి రూపంలో గణేషుడి విగ్రహాలు.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు..
రేపు (ఆగస్ట్ 31) వినాయక చవితి కావడంతో ఇప్పటికే గణేష్ విగ్రహాలు కాలనీల్లోకి వచ్చేశాయి. అయితే చవితి సంబరాల్లోనూ ఆర్ఆర్ఆర్ క్రేజ్ కనిపిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందించిన ఈ సినిమాకు సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఇక డైరెక్టర్ రాజమౌళి స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ విడుదలై 100 డేస్ పూర్తైన క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో కూడా ఈ చిత్రం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సంబరాలు మొదలయ్యాయి. రేపు (ఆగస్ట్ 31) వినాయక చవితి కావడంతో ఇప్పటికే గణేష్ విగ్రహాలు కాలనీల్లోకి వచ్చేశాయి. అయితే చవితి సంబరాల్లోనూ ఆర్ఆర్ఆర్ క్రేజ్ కనిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ చరణ్ పోషించిన పాత్ర అల్లూరి సీతారామరాజు రూపంలో వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ సమయంలో బ్రిటిష్ పాలకులకు.. చరణ్, తారక్ మధ్య జరిగిన పోరాటంలో చెర్రీ అల్లూరి సీతారామరాజు వేశాధరణలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అదే విధంగా వినాయకుడి విగ్రహాలను తయారు చేశారు. అల్లూరి పాత్రలో ఉన్న గణేష్ విగ్రహాల ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు..తారక్ రోల్ కు సంబంధించిన విగ్రహాలు సైతం మండపాల్లో దర్శనమిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పలు సన్నివేశాలతో కూడిన గణేష్ విగ్రహాలను కొన్ని తయారు చేశామని.. ఇప్పటికే అవన్ని అమ్ముడయ్యాయని తెలిపారు సీత శిల్పి. విగ్రహాల తయారి పూర్తి కాకముందే వాటిని బుక్ చేసుకున్నారని ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వినాయక విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.
పాన్ ఇండియా లెవల్లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియా కీలకపాత్రలలో నటించారు. మార్చి 25న గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా రాబట్టింది. ఆల్ టైమ్ అత్యథిక వసూళ్లు చేసిన నాల్గవ భారతీయ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్స్ జేమ్స్ గన్, డానీ డెవిటోతోపాటు ఇతర దర్శకులు సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.
Our Demi God @AlwaysRamCharan With Ganesha Idols !!#ManOfMassesRamCharan#RamCharan? pic.twitter.com/ANxjJs3E9S
— Ram Charan DHF (@ManiCharanDHFC) August 29, 2022
Our Demi God @AlwaysRamCharan With Ganesha Idols !!#ManOfMassesRamCharan#RamCharan? pic.twitter.com/Sa3MQ3sJEb
— Team RamCharan Vizag (@TeamRCVizag) August 28, 2022
?? Inka untayemo @AlwaysRamCharan craze ? pic.twitter.com/oZOuZPtSPU
— LeelaMadhuri (@MadhuCharan2731) August 29, 2022
— faruk (@faruk22367588) August 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.