Vaishnav Tej: మెగా ఫ్యామిలీ నుంచి డైరెక్టర్ వస్తున్నాడు.. ఆ ఇద్దరు స్టార్స్‌తో మల్టీస్టారర్ తీస్తాడట..
డైరెక్టర్ గిరీశాయ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోన్న వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నటులకు పెట్టింది పేరు మెగా కుటుంబం. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి నటనతో తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు వారు చాలా మంది ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మెగా కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల ఉప్పెన సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన మెగాహీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej).. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన కొండపొలం సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు రంగ రంగం వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ గిరీశాయ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోన్న వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను కొన్ని రోజులు తర్వాత యాక్టింగ్ ఆపేస్తాను అని.. తనకు ముందు నుంచి డైరెక్షన్ అంటే ఇష్టమని.. దర్శకత్వం పై దృష్టిసారిస్తానని చెప్పారు. భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. ఇప్పటికే ఓ కథ కూడా రాసుకున్నాను.. అన్నయ్య సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఎవరు దర్శకత్వం వైపు వెళ్లలేదు. కేవలం పవన్ కళ్యాణ్ తప్ప మరే నటుడు.. ఆ ఫ్యామిలీలో మెగా ఫోన్ పట్టలేదు. ఇక ఇప్పుడు వైష్ణవ్ సైతం మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిపారు.