Upcoming Movies: వినాయక చవితికి బోలేడంత వినోదం.. ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఇవే..

ఇటు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ వరుస సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. భారీ బడ్జె్ట్ మూవీస్ మాత్రమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు సైతం ప్రేక్షకుల ముందుకు

Upcoming Movies: వినాయక చవితికి బోలేడంత వినోదం.. ఈ వారం థియేటర్లలో/ ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఇవే..
Upcoming Movies
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:18 PM

ఆగస్ట్ నెలలో వరుస సూపర్ హిట్ చిత్రాలతో నిర్మాతలు ఊపిరి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వరుస డిజాస్టర్స్‏తో కొట్టుమీట్టాడుతున్న టాలీవుడ్‏కు బింబిసార, సీతారామం బ్లాక్ బస్టర్ హిట్స్ కొత్త ఆశలు రెకెత్తించాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ 2 సినిమా సైతం రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక వచ్చే వారం.. అంటే సెప్టెంబర్ నెలారంభంలో మరిన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇటు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ వరుస సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. భారీ బడ్జె్ట్ మూవీస్ మాత్రమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసుకుందామా.

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కోబ్రా. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్ అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు.

మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఇక ఇప్పుడు రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుండగా.. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 2న విడుదల కానుంది.

యంగ్ హీరో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. డైరెక్టర్స్ వంశీధర్ గౌడ్, పి. లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరరెక్కిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. జీ 5.. విక్రాంత్ రోణ.. తెలుగు.. సెప్టెంబర్ 2 మై డియర్ భూతం.. తెలుగు.. సెప్టెంబర్ 2

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. కఠ్‏పుత్లీ.. హిందీ.. సెప్టెంబర్ 2 ఖుదా హఫీజ్ 2.. హిందీ.. సెప్టెంబర్ 2

ఆహా.. పంచతంత్ర కథలు.. తెలుగు.. ఆగస్ట్ 31 పెళ్లి కూతురు పార్టీ.. తెలుగు.. ఆగస్ట్ 31

నెట్ ఫ్లిక్స్.. ఐ కేమ్ బై.. ఒరిజినల్ మూవీ.. ఆగస్ట్ 31 ఫ్యామిలీ సీక్రెట్స్.. వెబ్ సిరీస్.. ఆగస్ట్ 31 అండర్ హర్ కంట్రోల్.. ఒరిజినల్ మూవీ.. ఆగస్ట్ 31

అమెజాన్ ప్రైమ్.. ద లార్డ్ ఆఫ్ రింగ్స్.. వెబ్ సిరీస్ తెలుగు.. సెప్టెంబర్ 2

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!