Bheemla Nayak: భీమ్లానాయక్‌ సర్టిఫై చేశారు… డానియల్ శేఖర్ ఏమంటారు?

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్- దగ్గుబాటి రానా నటిస్తున్న క్రేజీ మల్టిస్టారర్‌ భీమ్లానాయక్... మలయాళంలో సంచలన విజయాన్ని

Bheemla Nayak: భీమ్లానాయక్‌ సర్టిఫై చేశారు... డానియల్ శేఖర్ ఏమంటారు?
Bheemla Nayak
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 7:04 AM

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్- దగ్గుబాటి రానా నటిస్తున్న క్రేజీ మల్టిస్టారర్‌ భీమ్లానాయక్… మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న అయ్యప్పనుమ్‌ కోషియం చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలున్నాయి.  ఫైనల్‌ కాపీ వైపు పరుగులు పెడుతోంది. షూట్ పార్ట్ ఇంకా పెండింగ్‌లో వున్నప్పటికీ… పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం శర వేగంగా జరుగుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్ వేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా నిత్య మీనన్‌ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే అందిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఎడిటెడ్ ఫుటేజ్‌ని ప్రత్యేకంగా పరిశీలించారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌. కొన్ని సలహాలు-సూచనలు కూడా ఇచ్చారు. DOP రవి.కె.చంద్రన్‌ పనితీరును మెచ్చుకుంటూ చేతిరాతతో అప్రిషియేషన్ లెటర్ రాసిచ్చారు. భీమ్లానాయక్‌ ప్రాజెక్ట్‌లో మీరు ఒక పార్ట్ కావడం సంతోషదాయకం… ఔట్‌పుట్‌లో మంచి డిఫరెన్స్ చూపించారు.. థ్యాంక్స్ అంటూ లెటర్రాసి ఫ్లవర్‌బొకేతో కలిపి ఇచ్చారు పవన్‌.

ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకుని ఫిదా అయ్యారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్. ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియో, మూడు పాటలు రిలీజై ఎడిటింగ్ క్వాలిటీపై కాంప్లిమెంట్లు దక్కించుకున్నాయి. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కాబోతోంది భీమ్లానాయక్. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ByLine: Srihari Raja, ET

Also Read: Sai Pallavi: అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నేచురల్ బ్యూటీ..

Sarkaru Vaari Paata: భారీ ధరకు మహేష్ సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

18 Pages : ఈ కుర్రహీరో “18 పేజెస్” లో ఏం రాసుకొని రాబోతున్నాడో తెలిసేది అప్పుడే.. నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

Tollywood : ఇటు బాలయ్యకు నో చెప్పి చిరుతో ఈ భామ.. అటు మెగాస్టార్‌కు నో చెప్పి నటసింహంకు ఓకే చెప్పిన ఆ బ్యూటీ..