Actor Nani: ప్రభాస్ లుక్ పై అర్షద్ వార్సీ కామెంట్స్.. ఘాటుగా మాట్లాడినందుకు బాధపడుతోన్న నాని
రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకున్న సినిమా బాలేదంటావా.. ? ప్రభాస్ లుక్ జోకర్లా ఎందుకు కనిపిస్తుంది అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. అయితే అర్షద్ వార్సీ కామెంట్స్ పై ఇటు టాలీవుడ్ స్టార్స్ కూడా గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు. అర్షద్ వార్సీ కామెంట్స్ పై న్యాచురల్ స్టార్ నాని రియాక్ట్ అవుతూ..

కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇన్నాళ్లు కేవలం బీటౌన్ ఇండస్ట్రీలోనే పాపులర్ అయిన ఈ నటుడి గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. అందుకు కారణం అతడు ఇటీవల ప్రభాస్ లుక్స్ గురించి కామెంట్స్ చేయడమే. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అతడిపై మండిపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకున్న సినిమా బాలేదంటావా.. ? ప్రభాస్ లుక్ జోకర్లా ఎందుకు కనిపిస్తుంది అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. అయితే అర్షద్ వార్సీ కామెంట్స్ పై ఇటు టాలీవుడ్ స్టార్స్ కూడా గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నారు. అర్షద్ వార్సీ కామెంట్స్ పై న్యాచురల్ స్టార్ నాని రియాక్ట్ అవుతూ.. అతడికి జీవితంలో ఇంత పబ్లిసిటీ ఎప్పుడూ వచ్చి ఉండదు.. మీరు అనవసరంగా ప్రాముఖ్యత లేని విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని అన్నాడు. నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. తాజాగా తన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆసక్తికరంగా మాట్లాడారు నాని.
ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబై వెళ్లిన నాని.. అర్షద్ వార్సీపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ నటుడి గురించి అలా మాట్లాడినందుకు చింతిస్తున్నానని అన్నారు. “అర్షద్ చాలా గొప్ప నటుడు.. అతడిని మున్నాబాయ్ సినిమా నుంచి ఇష్టపడుతున్నాం. ఉత్తరాది.. దక్షిణాది అని కాదు.. భారతదేశం మొత్తం అతడి ఇష్టపడుతుంది. నటులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. పదాల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్లే మేమిద్దరం బాధితులమయ్యాం.. ప్రభాస్ గురించి అర్షద్ చేసిన కామెంట్స్ విన్నానను.. ఆ తర్వాత అతడి గురించి నేను చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. మనం ఎంతో ఇష్టపడే వారి గురించి ఇలాంటి టాపిక్ వస్తే.. అనవసరమైన విషయానికి మనం ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని అంటాం. అదే విధంగా నేను మాట్లాడాను.. కానీ నా మాటలకు వచ్చిన రియాక్షన్స్ చూశాక నేను అర్షద్ ఇంటర్వ్యూ చూశాను. మీడియా, సోషల్ మీడియా తప్పుదోవ పట్టించిందని అర్థమైంది. అలాగే నా మాటలు కూడా మరో విధంగా జనాల్లోకి వెళ్లాయి” అంటూ చెప్పుకొచ్చారు నాని. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.
అసలు విషయానికి వస్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్షద్ వార్సీ.. కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని.. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో చూడాలనుకుంటున్నానని.. అక్కడ మెల్ గిబ్సన్ లా చూడాలని ఉందని.. ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదని అన్నారు. అయితే అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో అతడిపై డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








