AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ‘విడిపోయాక మళ్లీ వారితో స్నేహం చేయడం అస్సలు నచ్చదు’.. వైరలవుతున్న చైతూ కామెంట్స్..

పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Naga Chaitanya: 'విడిపోయాక మళ్లీ వారితో స్నేహం చేయడం అస్సలు నచ్చదు'.. వైరలవుతున్న చైతూ కామెంట్స్..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: May 03, 2023 | 6:59 AM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కస్టడీ. తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తుండగా.. ఇందులో మరోసారి చైతూ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇందులో సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళ్ యూట్యూబర్ ఇర్ఫాన్ వ్యూ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తన ఫిల్మ్ కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన జీవితంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని.. ఏది జరిగినా ఒక పాఠంగా మాత్రమే తీసుకోవాలని అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఇందులో రిలేషన్ షిప్ లో రిజెక్ట్ అయ్యారా అనే ప్రశ్నను చైతూ యాంకర్ ను అడగ్గా.. అతను స్పందిస్తూ.. రెండున్నరేళ్ల క్రితం తన జీవితంలో బ్రేకప్ జరిగిందని.. తను ప్రేమించిన అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని.. మంచి స్నేహితులుగా ఉందమని చెప్పిందని చెప్పుకొచ్చాడు. దీంతో చైతూ మధ్యలో కల్పించుకుని.. ఒక్కసారి రిజెక్ట్ చేసినవాళ్లతో మళ్లీ స్నేహం చేయడం తనకు చిరాగ్గా ఉంటుందని.. తనెప్పుడు స్నేహం కోసం ఎవరినీ అడగలేదని అన్నారు చైతూ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ ఇంటర్వ్యూలో మీరు ఎంత మందిని ముద్దులు పెట్టుకున్నారు అని అడగ్గా.. తాను లెక్క మర్చిపోయా అని.. సాధారణంగానే సినిమాల్లో చాలా ముద్దు సన్నివేశాలు ఉంటాయని.. వాటన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకోగలను అని అన్నారు. అయినా ఈ విషయాలన్ని జనాలకు తెలుసని అన్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను ఇబ్బందుల్లో పడతానేమో అంటూ నవ్వుతూ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.