AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vimanam Movie: ఆకట్టుకుంటున్న ‘రేలా రేలా’ సాంగ్.. ‘విమానం’ సినిమాలోని ఈ పాటను విన్నారా ?..

అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే తండ్రి వీర‌య్య ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా త‌ల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మ‌రి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పిన‌ట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగ‌తి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.

Vimanam Movie: ఆకట్టుకుంటున్న 'రేలా రేలా' సాంగ్.. 'విమానం' సినిమాలోని ఈ పాటను విన్నారా ?..
Rela Rela Song
Rajitha Chanti
|

Updated on: May 03, 2023 | 6:30 AM

Share

ఓ చిన్న కుర్రాడికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా చాలా ఆనందం అతడికి. దానిని ఎప్పుడూ ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరిక‌ను తండ్రికి చెబితే బాగా చ‌దువుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని చెబుతాడు. అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే తండ్రి వీర‌య్య ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా త‌ల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మ‌రి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పిన‌ట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగ‌తి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్రఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

ఈ చిత్రానికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేయగా.. తాజాగా ఈ విమానం నుంచి రేలా రేలా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘విమానం’ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్ సాంగ్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన పంథాంలో అద్భుతంగా పాటను ఆలపించారు.

వైవిధ్యంగా ప్రమోషనల్ కంటెంట్‌తో విమానం సినిమాపై బ‌జ్ క్రియేట్‌చేస్తోంది టీమ్‌. అందులో భాగంగా ఇప్ప‌టికే సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. అలాగే చిత్ర నిర్మాత‌లు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించారు. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బ‌హుమతుల‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం