AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilayaraja: ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో అన్నయ్య కుమారుడు మృతి..

పావలర్ శివన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పావలర్ శివన్ తన కుటుంబంతో కలిసి పుదుచ్చేరిలో నివసించేవారు. ఆయన ఫేమస్ గిటారిస్ట్. కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్ గా పనిచేస్తున్నారు.

Ilayaraja: ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో అన్నయ్య కుమారుడు మృతి..
Ilayaraja
Rajitha Chanti
|

Updated on: May 03, 2023 | 7:27 AM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన అన్నయ్య భావలార్ వరదరాజన్ కొడుకు పావలర్ శివన్ (60) కన్నుముశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివన్.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఇళయరాజా.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మనిగిపోయారు. పావలర్ శివన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పావలర్ శివన్ తన కుటుంబంతో కలిసి పుదుచ్చేరిలో నివసించేవారు. ఆయన ఫేమస్ గిటారిస్ట్. కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్ట్ గా పనిచేస్తున్నారు.

ఇళయరాజా సంగీత ప్రయాణానికి అతని అన్నయ్య పావాలార్ వరదరాజన్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన గేయ రచయిత మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు. ఇళయరాజా అన్నయ్య పావలర్ వరదరాజన్ 1973లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఒకరు 2020లో కిడ్నీ సమస్యతో మరణించగా.. మరో కుమారుడు పావలర్ శివన్ మే 2న అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పావలర్ శివన్ రెండు, మూడు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.

ఈరోజు పావలర్ శివన్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శివ అంత్యక్రియలలో ఇళయరాజా, యువంశంకర్‌రాజా, కార్తీకరాజా, గంగై అమరన్, వెంకట్ ప్రభు, ప్రేమ్‌జీ అమరన్, భవధరణి పాల్గొననున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.