Siddarth: ధరణి నటన.. వెన్నెల ఎనర్జీకి హీరో సిద్దార్థ్ ఫిదా.. దసరా సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్త నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని ఊర మాస్ పాత్రలో నటించిన చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో ధరణి పాత్రలో అదరగొట్టారు నాని. ఈ చిత్రాన్ని నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించగా.. ఇందులో వెన్నెల పాత్రలో మెప్పించింది కీర్తి సురేష్. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్త నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్ ఫాంపై సైతం ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ రస్టిక్, యాక్షన్ డ్రామాను ఇంట్లోనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే డైరెక్షన్, నాని, కీర్తి నటనపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా దసరా సినిమా చూసిన హీరో సిద్ధార్థ్.. ఇందులో నాని, కీర్తి నటనకు ఫిదా అయ్యారు. ధరణి పాత్రలో నాని నటన అద్భుతమని.. అలాగే మాస్ బీట్‌లో ఫుల్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఔట్ స్టాండింగ్ వర్క్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టోరీలో షేర్ చేశారు సిద్ధార్థ్. ఇది చూసిన నాని.. సిద్ధూకు థాంక్స్ చెప్పారు.
తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. రెగ్యులర్ స్టోరీనే తనదైన శైలిలో వెండితెరపై చూపించారు. ఇందులో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్ర పోషించగా.. . షైన్ టామ్ చాకో, సాయి కుమార్, సముద్రఖణి, పూర్ణ, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.
View this post on Instagram