Mahesh Babu: ఫ్యామిలీతో వెకేషన్‌కు సూపర్ స్టార్.. మహేష్ ధరించిన బ్యాక్ ప్యాక్ ధర తెలిస్తే షాకే..
ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇటీవలే భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆ సమయంలో మహేష్ లుక్, ఫ్యాషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. మహేష్ ధరించిన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్ ప్యాక్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు పూర్తిగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మహేష్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పెద్ద జుట్టు, గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లాడు మహేష్. ఇటీవలే భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఆ సమయంలో మహేష్ లుక్, ఫ్యాషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు.. మహేష్ ధరించిన లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్ ప్యాక్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఐకానిక్ LV మోనోగ్రామ్‌ను కలిగి ఉన్న సొగసైన నలుపు, నీలం రంగులో ఉన్న ఆ బ్యాక్ ధర అక్షరాల రూ. 3,81,841.50. అవును.. ఈ హై-ఎండ్ ఫ్యాషన్ యాక్సెసరీ నిజంగా మహేష్‌కు లగ్జరీ పట్ల ఉన్న ప్రేమను హైలైట్ చేస్తుంది. టాలీవుడ్‌లో ఫ్యాషన్ ఐకాన్‌గా మహేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం కూడా అతడి స్టైలే. గతంలోన అనేక సార్లు లూయిస్ విట్టన్ బ్యాక్ ధరించాడు. సినిమా ఈవెంట్స్, పార్టీలలో మహేష్ ధరించే సింపుల్ టీషర్ట్స్ ధర తెలుసుకోవడానికి కూడా ఫ్యాన్స్ ట్రై చేస్తుంటారు.
మహేష్ బాబు SS రాజమౌళితో తన రాబోయే చిత్రం SSMB29 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం అతని కొత్త లుక్ ఎగ్జైట్‌మెంట్‌ను సృష్టిస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతోపాటు మరిన్ని వివరాలు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.