Krishna: కృష్ణ జీవితమే అతి పెద్ద సినీ మ్యూజియం.. ఎన్నో మధురానుభూతులు..
కృష్ణ షూటింగ్ సమయంలో చాలా చాలా కామ్. ఆయన మైండ్ ఎప్పుడూ ఎంప్టీగా ఉండేది కాదు. ఎప్పుడూ.. షూటింగులు, ప్రొడ్యూసర్లు, వారి సాధక బాధకాలు, హెట్ టిక్ షెడ్యూల్ తప్ప.. ఆయన ఇతర విషయాల మీద పెద్దగా కాన్ సన్ ట్రేట్

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. సినీ ప్రముఖులు.. అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరో ఇక లేరు అనే వార్తను ప్రజలు జీర్ణంచుకోలేకపోతున్నారు. చిత్రపరిశ్రమలో ఎన్నో సాహసాలు చేసి.. తెలుగు తెరకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేసిన ఘనత కృష్ణ సొంతం. కృష్ణ జీవితం అతి పెద్ద సినీ మ్యూజియం. ఇందులో ఎన్నో మధురానుభూతులు, ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇలా రకరకాలు. కృష్ణ షూటింగ్ సమయంలో చాలా చాలా కామ్. ఆయన మైండ్ ఎప్పుడూ ఎంప్టీగా ఉండేది కాదు. ఎప్పుడూ.. షూటింగులు, ప్రొడ్యూసర్లు, వారి సాధక బాధకాలు, హెట్ టిక్ షెడ్యూల్ తప్ప.. ఆయన ఇతర విషయాల మీద పెద్దగా కాన్ సన్ ట్రేట్ చేసేవారు కాదు. అయితే ఇదంతా ఒక సిస్టమాటిగ్గా జరిగిపోతూ ఉంటుంది. వన్ బై వన్ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లేవారు కృష్ణ. ఒకటా రెండా సుమారు యాభై ఏళ్ల సుదీర్గ సినీ జీవితంలో ఆయనకు రకరకాల యావగేషన్లు. దీంతో ఆయన స్పాట్ లో ఎంతో సైలెంట్ గా ఉండేవారు.
అదే సమయంలో ఆయన కాంపౌండ్ ఒక మూవీ ఫ్యాక్టరీలా ఉండేది. సినిమా మొదలయ్యిందంటే.. చాలు ఇక ఆయన టీంలో ఎవరికీ నిద్రాహారాలుండేవి కావు. అలాగని ఎవ్వరూ ఇబ్బందిగా ఫీలయ్యేవారు కాదు. అందరూ సినిమాకు కోపరేట్ చేసేవారు. ఈ టైట్ షెడ్యూల్లో కూడా.. ఆయన సినీ సాంకేతికత మీద విపరీతంగా దృష్టి సారించేవారు. ఆయా టెక్నికాల్టీస్ గురించి విని వదిలేయకుండా.. తన సినిమాల్లోకి తప్పక తీసుకొచ్చేవారు. అలా తన సినిమాల ద్వారా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేస్తూ.. తెలుగు తెరపై ఎన్నో చిత్ర విచిత్రాలు నమోదు చేశారాయన.
కృష్ణ మోసగాళ్లకు మోసగాడు ఇంగ్లీష్ లో ది ట్రెజర్ హంట్ పేరిట డబ్ చేశారు. ఇందులోని పాటలన్నిటినీ తీసేశారు. దీన్ని గ్రీస్ లో ప్రదర్శిస్తుండగా.. ఆ భాషలోనూ డబ్ చేయాలనుకున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్. అయితే అందులోని ఒక పాట సగం కట్ చేసి ఉండటం గమనించి.. దాన్ని పూర్తిగా కావాలని కోరగా.. అది తెలుగు పాట కదా? మీవాళ్లెలా అర్ధమవుతుందని అడగ్గా.. ఈ పాటలోని రాజసులోచన జిప్సీ సుందరిలా ఉందనీ. అది జిప్సీ భాషగా మా వాళ్లు అనుకుంటారని అన్నాడట ఆ పంపిణీదారు. దేశ విదేశాల్లో తన సినిమాలనొక చర్చనీయాంశం చేసిన ఒన్ అండ్ ఓన్లీ కృష్ణ.




కృష్ణ చూడ్డానికి కామ్‌గా ఉంటారు గానీ.. సీరియస్ పర్సనాల్టీ ఏం కాదు. 1982లో కృష్ణ- బాపు కాంబోలో మరో సినిమా వచ్చింది. ఈ సినిమా డ్యాన్స్ డైరెక్టర్‌తో కృష్ణ మాట్లాడుతూ.. పాపం బాపూగారూ.. సాక్షి వచ్చి పదిహేనేళ్లయ్యింది కదా ? నటనలో బాగా ఇంప్రూవ్ అయ్యి ఉంటానని అనుకుంటున్నారేమో. నేనేం మారలేదని చెప్పమన్నారట కృష్ణ. అలా తనపై తానే సెటైర్లు వేసుకోగల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి కేరాఫ్ కృష్ణ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
