AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Facts: మీ ఫోన్ కింది భాగంలో ఈ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? డిజైన్‌ అనుకుంటే పొరబాటే

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా దగ్గరగా గమనిస్తే ఫోన్ అడుగు భాగంలో లేదా పై భాగంలో సూది మొనలాంటి చిన్న చిన్న రంధ్రాలు మీకు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ అడుగుభాగంలో ఉండే చిన్న రంధ్రాలు అసలు ఎందుకు..

Srilakshmi C
|

Updated on: Mar 29, 2026 | 6:15 AM

Share
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా దగ్గరగా గమనిస్తే ఫోన్ అడుగు భాగంలో లేదా పై భాగంలో సూది మొనలాంటి చిన్న చిన్న రంధ్రాలు మీకు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్ అడుగుభాగంలో ఉండే చిన్న రంధ్రాలు అసలు ఎందుకు ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం డిజైన్ ఫీచర్ మాత్రమే కాదు దీని వెనుక ఓ ముఖ్యమైన సాంకేతిక అంశం కూడా ఉంది.

1 / 5
చాలా మంది ఇది కేవలం ఒక డిజైన్ లేదా ఫోన్‌ను రీసెట్ చేసే బటన్ అని అనుకుంటారు. కానీ సాంకేతిక పరిభాషలో దీనిని నాయిస్-క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అని అంటారు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఫోన్‌లోని ప్రధాన మైక్రోఫోన్ మన స్వరాన్ని రికార్డ్ చేస్తుంది. అదే సమయంలో ఈ చిన్న రంధ్రం (రెండవ మైక్రోఫోన్) మన చుట్టూ ఉన్న ట్రాఫిక్ శబ్దం, గాలి, ఇతరులు మాట్లాడుకోవడం వంటి శబ్దాలను రికార్డ్ చేస్తుంది.

2 / 5
ఫోన్‌లోని స్మార్ట్ టెక్నాలజీ రెండు శబ్దాలను పోల్చి అనవసరమైన శబ్దాలను తొలగిస్తుంది. ఫలితంగా అవతలి వ్యక్తి మీ స్వరాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా స్పష్టంగా వినగలరు. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పుడు రెండు లేదా మూడు రంధ్రాలు ఉంటున్నాయి. మొదటి రంధ్రం ప్రాథమిక మైక్రోఫోన్. ఇది మీ స్వరాన్ని స్పష్టంగా సంగ్రహిస్తుంది. రెండవ రంధ్రం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అంటే ఇది పరిసర శబ్దాన్ని తగ్గిస్తుంది. మూడవ రంధ్రం డైరెక్షనల్ ఆడియో కోసం. ఇది వీడియోలను రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ దిశ నుంచి వచ్చే ధ్వనిని సంగ్రహిస్తుంది.

3 / 5
అయితే చాలా మంది ఫోన్లలో ఈ రంధ్రాలను సరిపోని సైజులో ఉన్న కవర్లతో కప్పి ఉంచుతారు. దీనివల్ల మీరు కాల్‌లో ఉన్నప్పుడు మీ స్వరం అవతలి వ్యక్తికి అస్పష్టంగా వినిపిస్తుంది. ఈ రంధ్రం సిమ్ ట్రేను తెరిచే రంధ్రంలాగే కనిపిస్తుంది. మీరు పొరబాటున ఈ మైక్రోఫోన్ రంధ్రంలోకి సిమ్ పిన్‌ను చొప్పించినట్లయితే, సున్నితమైన లోపలి పొర (మైక్రోఫోన్ లేయర్) దెబ్బతింటుంది.

4 / 5
ఈ పొర ఒకసారి చిరిగిపోతే మీ ఫోన్‌లోని నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ శాశ్వతంగా పాడై పోతుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లలోని ఈ చిన్న రంధ్రాలు చిన్నవిగా అనిపించినప్పటికీ ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అవి పెద్ద పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోవాలి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం.

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌