Bigg Boss : అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇక గుడ్ బై.. ఎందుకంటే..
తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ స్టార్ హీరో బిగ్‌బాస్ రియాల్టీ షో హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా షోను నడిపిన ఆయన ఇప్పుడు షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం అన్ని భాషలలో ఈ షో ప్రసారమవుతుంది. అయితే ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరో ఈ షో హోస్టింగ్ చేస్తున్నారు. తెలుగులో అక్కినేని నాగార్జున, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో మొన్నటివరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ స్టార్ హీరో బిగ్‌బాస్ రియాల్టీ షో హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా షోను నడిపిన ఆయన ఇప్పుడు షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అతడే కిచ్చా సుదీప్. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 11కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ ఆ తర్వాత సీజన్ ఉండనని చెప్పి ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
“బిగ్‌బాస్ కన్నడ 11కి అత్యుత్తమ స్పందన ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నాపై, ఈ షోపై మీరు చూపించిన అభిమానం, ప్రేమ ఏంటో టీఆర్పీ రేటింగ్ చూస్తే తెలుస్తోంది. ఈ పదకొండు సంవత్సరాలు మీతో కలిసి ప్రయాణించడం చాలా బాగుంది. ఇప్పుడు నేను వేరే వాటిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ప్రెజెంటర్‌గా ఇదే నా చివరి బిగ్‌బాస్. ఇన్ని సంవత్సరాలుగా బిగ్‌బాస్ చూస్తున్న మీరూ, కలర్స్ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. ఈ నిర్ణయాన్ని ఉత్తమంగా తీసుకుందాం. మీ అందరినీ అలరిస్తాను” అంటూ రాసుకోచ్చారు. దీంతో 11వ సీజన్ ప్రారంభంలో సుదీప్ ఈసారి బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా అనే సందేహం నెలకొంది. కానీ షో నిర్వాహకులు సుదీప్‌ని ఒప్పించి కొనసాగించారు. అయితే ఇదే అతడికి చివరి సీజన్. ‘మీరు లేకుండా బిగ్‌బాస్‌ని ఊహించలేం’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కిచ్చా సుదీప్ కన్నడలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. కానీ విలన్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన ఈగ చిత్రంలో సుదీప్ ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీప్. ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.
Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS
— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.