Kamal Haasan: కమల్‌ సార్‌.. మీరు చాలా గ్రేట్‌.. సంక్రాంతి రోజున వారందరకీ విందు భోజనాలు ఏర్పాటుచేసిన హీరో

లోకనాయకుడు కోలీవుడ్ సీనియర్ హీరో కమల్‌ హాసన్‌ ఇప్పుడు బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. అలాగే తమిళనాడు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Kamal Haasan: కమల్‌ సార్‌.. మీరు చాలా గ్రేట్‌.. సంక్రాంతి రోజున వారందరకీ విందు భోజనాలు ఏర్పాటుచేసిన హీరో
Kamal Haasan
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2024 | 11:18 AM

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ఇప్పుడు బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. అలాగే తమిళనాడు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌ బాస్‌ తమిళ్‌ ఏడో సీజన్‌కు ఆదివారం (జనవరి 14)న శుభం కార్డు పడింది. షో మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో ఎంట్రీ ఇచ్చిన అర్చన రవిచంద్రన్ విజేతగా దృష్టిని ఆకర్షించింది. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ టైటిల్‌ గెలిచిన తొలి మహిళా కంటెస్టెంట్ అర్చన రవిచంద్రన్. విశేషమేమిటంటే బిగ్ బాస్ తమిళ్ ఫైనలిస్టులు ఇద్దరూ కూడా మహిళలే. అర్చన రవిచంద్రన్ విజేతగా నిలవగా, మణిచంద్రన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అలాగే మణిచంద్రన్, ప్రియా కృష్ణన్, దినేష్, విష్ణు మరియు అర్చన రవిచంద్రన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ సందర్భంగా బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ కంటెస్టెంట్లందరికీ స్పెషల్‌ లంచ్‌ ఏర్పాటు చేశాడు హోస్ట్‌ కమల్‌ హాసన్‌. బిగ్‌ బాస్‌ టీమ్‌ మెంబర్లకు కూడా విందు భోజనాల పార్టీ ఇచ్చాడు. సంక్రాంతి పండగ పూట పసందైన రుచులతో రకరకాల వెరైటీలను వడ్డించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు కమల్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్‌ సార్‌.. మీరు గ్రేట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క‌మల్‌ హాస‌న్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2 సినిమాలో న‌టిస్తున్నాడు. శంక‌ర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్దార్థ్‌, బాబీ సింహా, వివేక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు లెజెండ్‌ మణిరత్నం డైరెక్షన్‌ లో థగ్‌ లైఫ్‌ మూవీ చేస్తున్నారు కమల్‌. త్రిష, దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీ రోల్స్‌పోషిస్తున్నారు. అలాగే హెచ్‌ వినోద్‌, స్టంట్‌ డైరెక్టర్‌ అన్‌ భైరవ్‌ డైరెక్షన్లలోనూ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు కమల్

ఇవి కూడా చదవండి

వరుస సినిమాలతో బిజీబిజీగా కమల్..

చేతిలో క్రేజీ ప్రాజెక్టులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..