AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Askhara Haasan: ముంబైలో రూ.20 కోట్లతో ఇళ్లు కొన్న శ్రుతిహాసన్ చెల్లెలు.. అక్షర హాసన్ సంపాదన ఎంతో తెలుసా ?..

తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది శ్రుతి. ఇక కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు.. కానీ 2015లో షమితాబ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె శ్రుతిహాసన్ మాదిరిగా గుర్తింపు మాత్రం అందుకోలేకపోయింది.

Askhara Haasan: ముంబైలో రూ.20 కోట్లతో ఇళ్లు కొన్న శ్రుతిహాసన్ చెల్లెలు.. అక్షర హాసన్ సంపాదన ఎంతో తెలుసా ?..
Kamal Haasan, Akshara Haasa
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2023 | 4:10 PM

Share

లోకనాయకుడు కమల్ హాసన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అనేక విభిన్న పాత్రలు పోషించి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన పెద్ద కూతురు శ్రుతిహాసన్ సైతం ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా గాయనిగానూ మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది శ్రుతి. ఇక కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు.. కానీ 2015లో షమితాబ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె శ్రుతిహాసన్ మాదిరిగా గుర్తింపు మాత్రం అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం అక్షర హాసన్ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. ఇప్పుడు అక్షర ముంబైలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఆ అపార్ట్‌మెంట్ విలువ దాదాపు రూ. 5.75 కోట్లు ఉంటుందట. 2,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది15 అంతస్తుల టవర్‌లోని 13వ అంతస్తులో ఉంది. అంతేకాకుండా మూడు కార్ పార్కింగ్ స్థలాలను కలిగి ఉంది. అయితే, దీనికి సంబంధించి అక్షర నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

నివేదిక ప్రకారం.. అపార్ట్‌మెంట్ 1303 ఖార్‌లోని 16వ రోడ్‌లోని 15-అంతస్తుల లగ్జరీ టవర్‌లోని 13వ అంతస్తులో అక్షర అపార్ట్మెంట్ తీసుకుందట. 2,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాల్కనీని కలిగి ఉంది. అలాగే రూ.94.50 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. అక్షర హాసన్ నటుడు కమల్ హాసన్, అతని రెండవ భార్య సారిక ఠాకూర్ కుమార్తె. ఇక ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న అగ్ని సిరగుగల్ అనే చిత్రంలో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.