AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: ఇదెక్కడి ట్విస్ట్..! ఆత్మహత్య చేసుకున్న దర్శన్ మేనేజర్..

పరారీ లో ఉన్న దర్శన్ మాజీ మేనేజర్ మల్లి కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. ఈలోగా తాను బతికే ఉన్నానని, అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నానని, అప్పు తీర్చేందుకు కావాల్సిన డబ్బు సంపాదిస్తానని మల్లి తన భార్యకు లేఖ ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్శన్‌  మరో మేనేజర్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతుంది.

Darshan: ఇదెక్కడి ట్విస్ట్..! ఆత్మహత్య చేసుకున్న దర్శన్ మేనేజర్..
Darshan
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2024 | 6:43 PM

Share

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ కు ఉచ్చు బిగుస్తుంది. కొన్ని పాత కేసులు కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు పోలీసులు. కాగా పరారీలో ఉన్న దర్శన్ మాజీ మేనేజర్ మల్లి కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. ఈలోగా తాను బతికే ఉన్నానని, అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నానని, అప్పు తీర్చేందుకు కావాల్సిన డబ్బు సంపాదిస్తానని మల్లి తన భార్యకు లేఖ ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్శన్‌  మరో మేనేజర్‌ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతుంది. దర్శన్ మేనేజర్‌గా పనిచేసిన శ్రీధర్ ఏప్రిల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పుడు పోలీసులు ఆ కేసును కూడా తిరిగి దర్యాప్తు చేస్తున్నారు.

దర్శన్ మేనేజర్‌గా ఏడాదిపాటు పనిచేసిన శ్రీధర్ ఏప్రిల్ 17న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహం అనేకల్ తాలూకాలోని దర్శన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో దొరికింది. శ్రీధర్ ఆ ఫామ్ హౌస్ ను చూసుకునే వాడు. అదే ఫామ్‌హౌస్‌లో అతని మృతదేహం లభ్యమైంది. ఆ సమయంలో అతడి స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీధర్ డెత్ నోట్ కూడా లభ్యమైంది, ‘నా చావుకు నేనే కారణమని, ఒంటరితనం నన్ను వేధిస్తోంది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రీధర్ అందులో రాశాడు. ఆనేకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ నిందితుడు కావడంతో అతడి పాత కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యంలో శ్రీధర్ ఆత్మహత్య కేసును మళ్లీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఘటనపై బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున మాట్లాడుతూ.. ‘శ్రీధర్‌ డెత్ నోట్‌లో చావుకు ఎవరూ కారణం కాదని, ఒంటరితనం వల్లే చనిపోతున్నాడని, ఎవరినీ డిస్టర్బ్ చేయవద్దని రాసి ఉంది. . ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో అతను విషం తాగినట్లు తేలింది. ఇప్పుడు ఆ బాడీలోని కొన్ని శరీర భాగాలను పంపాము, ఇంకా నివేదిక రాలేదు. ఫామ్ హౌస్ నుంచి మరికొంత మందిని విచారించి వాంగ్మూలం తీసుకుంటాం అని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us