AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarfira Trailer: సూర్య సినిమాను రీమేక్ చేస్తున్న అక్షయ్.. ట్రైలర్ చూశారా.?

అక్షయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సర్ఫీరా అనే సినిమాతో అక్షయ్ రానున్నాడు. ఈ సినిమా సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. జూలై 12న సినిమా విడుదల కానుంది. కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమిళ నటుడు సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

Sarfira Trailer: సూర్య సినిమాను రీమేక్ చేస్తున్న అక్షయ్.. ట్రైలర్ చూశారా.?
Akshay Kumar
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2024 | 6:29 PM

Share

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఏడాది 5,6 ఆసినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ అక్షయ్ కుమార్ సాలిడ్ సక్సెస్ అందుకొని చాలా కాలం అయ్యింది. అక్షయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సర్ఫీరా అనే సినిమాతో అక్షయ్ రానున్నాడు. ఈ సినిమా సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. జూలై 12న సినిమా విడుదల కానుంది. కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమిళ నటుడు సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. తమిళ్ లో ఈ సినిమాను సూర్య హీరోగా సూరరై పొట్రు అనే టైటిల్ తో తెరకెక్కించారు. ఆతర్వాత అదే సినిమాను తెలుగులో ఆకాశం నీ హద్దు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ తో హిందీలో రీమేక్ అవుతుంది ఈ మూవీ.

పేదలకు కూడా తక్కువ ధరకే విమాన సేవలు అందించాలనే కన్నడిగ కెప్టెన్‌ జి.ఆర్‌. గోపీనాథ్ జీవితం ఆధారంగా తమిళంలో ‘సురారై పోట్రు’ సినిమా రూపొందింది. కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దాంతో నటుడు సూర్య చాలా ఆసక్తిగా తీసుకుని ‘సురారై పోట్రు’ సినిమా చేశాడు. ఈ తమిళ సినిమా తెలుగు, కన్నడ, హిందీ వంటి భాషలకు కూడా డబ్ అయ్యింది. హిందీ ప్రేక్షకులు కూడా ఒరిజినల్ సినిమాను ఓటీటీలో చూశారు. ఇంత చేసినా ఈ సినిమాను అక్షయ్ కుమార్ ఎందుకు రీమేక్ చేసాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం విడుదలైన ‘సర్ఫిరా’ ట్రైలర్ చూస్తుంటే ‘సురారై పోట్రు’ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గుర్తుకొస్తుంది. మేకింగ్ పరంగా పెద్దగా మార్పులేదు. ఇప్పటికే OTTలో చూసిన ఈ కథనాన్ని చూసేందుకు జనాలు మళ్లీ వస్తారో లేదో జూలై 12న తెలుస్తుంది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఇప్పుడు హిందీ రీమేక్‌కి కూడా డైరెక్షన్ చేశారు. అలాగే ఈ సినిమా  సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us