AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 15 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయ యోగం.. ఉద్యోగాల్లో శుభవార్తలు!

జూన్ 15, 2026 సోమవారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఆదాయ వృద్ధి, దాంపత్య సౌఖ్యం లభిస్తాయి. వృషభ రాశి వారు ఉద్యోగంలో ప్రతిభ కనబర్చి అధికారుల ప్రశంసలు పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య పరమైన అంశాల్లో గ్రహస్థితులు ఎలాంటి ప్రభావం చూపనున్నాయో తెలుసుకోండి.

జూన్ 15 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయ యోగం.. ఉద్యోగాల్లో శుభవార్తలు!
Horoscope Today 15 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 15, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి. అధికారులు కొత్త లక్ష్యాలు, బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉన్నా, అంచనాల్ని మించిన లాభం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా ఒత్తిడి, శ్రమాధిక్యత ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో అనుకూలత పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచుతారు. విద్యార్థులకు శ్రమ తప్పదు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఎవరికీ హామీలు ఉండడం గానీ, వాగ్దానాలు చేయడం కానీ ప్రస్తుతానికి మంచిది కాదు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలు చేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యతకు లోటుండదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు బాగా ఇబ్బంది కలిగిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు, శక్తి సామర్థ్యాలు బాగా నచ్చుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో విరామం లేకుండా ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ, తిప్పటతో పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల సహాయంతో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ లాభాలు గడిస్తారు. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు పూర్తిగా నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. కొన్ని వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేపడతారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభసాటిగా సాగిపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Follow Us