AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం.. అది చూశాక జాన్వీ పాత్ర మీకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది: బుచ్చిబాబు

పెద్ది' బ్రహ్మాండంగా రన్ అవుతోంది. చరణ్ గారి పెర్ఫార్మెన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. బుధవారం నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం అని సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెలిపారు. జూన్ 4న విడుదలైన పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.

కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం.. అది చూశాక జాన్వీ పాత్ర మీకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది: బుచ్చిబాబు
Peddi
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 8:32 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

బుచ్చిబాబు  మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమాలో కొత్త సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం.. ఆల్రెడీ ఎడిట్ చేశాం. ఈ బుధవారం(జూన్ 17) నుంచి యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం.. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్ ఉంటుంది. మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి. 95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ గారి నటనను ప్రశంసించారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు. మేము వెళ్లిన ప్రతి థియేటర్‌లో అద్భుతమైన స్పందన లభించింది. అలాగే జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు జోడిస్తాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను అని బుచ్చిబాబు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. మొన్న నేను కారులో వెళ్తుంటే ఒక ఆటో డ్రైవర్ తన అమ్మగారితో వచ్చి, “చాలా అద్భుతమైన సినిమా తీశావు బాబు. 25 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్‌కు వచ్చాను” అని చెప్పారు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..