Varalaxmi Sarathkumar: దేవుడా..! వరలక్ష్మీకి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా..?
తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళ్ లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది.
లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈసినిమా తర్వాత వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళ్ లోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే త్వరలోనే వరలక్ష్మీ పెళ్లిపీటలెక్కనుంది. ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
నికోలాయ్ సచ్ దేవ్‌ను అనే వ్యక్తిని వరలక్ష్మీ వివాహం చేసుకోనుంది. ఈ ఇద్దరి పెళ్లి థాయిలాండ్ లో జరగనుంది. ఇప్పటికే ఈ పెళ్ళికి రావాలని సినీ సెల్బ్రెటీలను స్పెషల్‌గా ఇన్వైట్ చేసింది వరలక్ష్మీ. వెండింగ్ కార్డ్స్ పంచుతూ ప్రతి ఒక్క సెలబ్రిటీని తన పెళ్ళికి ఆహ్వానించింది. అయితే ఇప్పుడు వరలక్ష్మీకి కాబోయే భర్త గురించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
నికోలాయ్ సచ్ దేవ్‌ను అంతకు ముందే వివాహం అయ్యింది. అయితే వరలక్ష్మికి 14 ఏళ్లుగా నికోలాయ్ బాగా తెలుసట. మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కనున్నారు ఈ ఇద్దరూ.. కాగా నికోలాయ్ వరలక్ష్మిని రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. అంతే కాదు ఇతగాడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నికోలాయ్ మొదటి భార్య పేరు కవిత. ఆమె 2010లో మిసెస్ గ్లాడ్రాగ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఇద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా తాజాగా వరలక్ష్మి నికోలాయ్ కూతురితో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరలక్ష్మీకి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా అని అంతా షాక్ అవుతున్నారు. అంతే కాదు నికోలాయ్ కూతురుకు ఇప్పుడు 15 ఏళ్లు. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్‌లో అథ్లేట్ ఛాంపియన్ కూడా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.