Tollywood : అందరూ హీరోయిన్లా ఉన్నావ్‍లా ఉన్నావ్ అంటారు.. కానీ.. అలాంటి పాత్రలే ఇస్తారు.. టాలీవుడ్ నటి..
తెలుగు సినీరంగంలో నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు చాలా మంది. కానీ అవకాశాలు అంతగా రాక.. వచ్చినా సరైన బ్రేక్ అందుకోలేకపోయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అవుదామని వచ్చి.. సహాయ నటిగా సెటిల్ అయిన తారల గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ టాలీవుడ్ నటి తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్ నటి జయలలిత గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల్లో నటిగా అలరించిన ఆమె.. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయలలిత తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు, కుటుంబం పట్ల తన నిబద్ధత గురించి చెప్పుకొచ్చారు. తాను చాలా సున్నితమైన మనిషిని అయినప్పటికీ, తన మానసిక స్థితి ఎప్పుడూ నలిగిపోలేదని, దీనికి ప్రధాన కారణం కుటుంబ బాధ్యత అని ఆమె వెల్లడించారు. తనపై 14 మంది ఆధారపడి ఉన్నారని, వారిని బతికించాలనే ధ్యేయంతోనే తాను అనుకున్న క్యారెక్టర్లు రాకపోయినా, వచ్చిన పాత్రలతో సంతృప్తి పడుతూ ముందుకు సాగానని చెప్పారు.
ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..
ఆమెను అందరూ హీరోయిన్ మెటీరియల్ అని చెప్పేవారు కానీ, ఆమెకు వ్యాంప్ పాత్రలే లభించాయని అన్నారు. ఆ పాత్రలు చేయడం ఇష్టం లేకపోయినా, కుటుంబం కోసం వాటిని స్వీకరించానని, స్పెషల్ సాంగ్స్ చేసినా వాటిలో క్లాసికల్ డ్యాన్స్ మిశ్రమం కనిపించేదని ఆమె పేర్కొన్నారు. ఇది అదృష్టమో, దురదృష్టమో తెలియదని అన్నారు. చిన్నతనం నుంచే ఆరవ ఏట నుంచే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, లలిత సిస్టర్స్‌లాగా సంపాదించి కుటుంబానికి ఇచ్చానని, ఆంధ్రా నాట్యం నేర్చుకుంటున్నప్పుడు ఆమె తండ్రి ఒక సినిమా కోసం హీరోయిన్‌గా పరిచయం చేశారని వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!
కుటుంబ పోషణ డాన్స్ ప్రోగ్రామ్స్‌పైనే ఆధారపడిందని, అన్నదమ్ములు పెద్దగా బాధ్యతలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. పెద్దన్నయ్యకు చిన్న వయసులోనే పెళ్లి చేసి, అల్లుడిలా వేరే ఇంటికి వెళ్లారని, రెండో అన్నయ్య కూడా బాధ్యత లేని వ్యక్తి అని తెలిపారు. చిన్నప్పటి నుంచే తనలో ఉన్న ఈ పెద్ద మనసు వల్లే సినీ పరిశ్రమలోని కష్టనష్టాలను అర్థం చేసుకుని గెట్ ఆన్ అవ్వగలిగానని ఆమె అన్నారు. ఇది తన గొప్పదనం కాదని, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పదని జయలలిత వినయంగా చెప్పారు. కుటుంబ సభ్యుల పట్ల ఏమాత్రం అసంతృప్తి లేదని, వారికి పెట్టడం తనకు ఇష్టమని ఆమె చెప్పారు. ఈ దాతృత్వమే ఆమెకు మైనస్ పాయింట్ అయి ఉండవచ్చని ఆమె అంగీకరించారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

Jayalalitha News
ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..
