AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం తాగి వచ్చార్రా సామీ.. రికార్డులనే తరిమి తరిమి పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..

KL Rahul Nitish Rana Partnership Record: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, నితీష్ రాణా విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఈ జోడీ అజేయంగా 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించింది. రాహుల్ విశ్వరూపం ప్రదర్శించి 152 పరుగులు చేయగా, రాణా మెరుపు ఇన్నింగ్స్‌తో రికార్డుల వేటను కొనసాగించారు.

ఏం తాగి వచ్చార్రా సామీ.. రికార్డులనే తరిమి తరిమి పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
Kl Rahul Nitish Rana Partnership Record
Venkata Chari
|

Updated on: Apr 25, 2026 | 7:09 PM

Share

KL Rahul Nitish Rana Partnership Record: ఢిల్లీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నిశ్శంక కేవలం 11 పరుగులకే వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. పవర్‌ప్లేలో 68 పరుగులు చేసిన ఈ జోడీ, ఆ తర్వాత కేవలం 9 ఓవర్లలోనే 189 పరుగులు పిండుకోవడం గమనార్హం.

ఢిల్లీ క్యాపిటల్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ స్కోర్..

ఈ విధ్వంసం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు అత్యంత వేగంగా (15.3 ఓవర్లలోనే) 200 పరుగుల మార్కును అందుకుంది. గతంలో ముంబైపై 16.1 ఓవర్లలో చేసిన రికార్డును ఈ మ్యాచ్‌తో తిరగరాశారు. అంతేకాకుండా, పంజాబ్ కింగ్స్‌పై రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (140 పరుగులు) నెలకొల్పిన జోడీగా కూడా వీరు నిలిచారు.

పంజాబ్ బౌలర్ల బజాయంపు..

ఢిల్లీ బ్యాటర్ల దాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా జేవియర్ బార్ట్లెట్ వేసిన ఒక ఓవర్లో నితీష్ రాణా 2 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకుపడటంతో ఆయన ఎకానమీ రేటు ఏకంగా 17.25కు చేరుకుంది. స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 49 పరుగులు సమర్పించుకోగా, మార్కో జాన్సెన్ (45 పరుగులు), వైశాఖ్ (48 పరుగులు), యుజ్వేంద్ర చాహల్ (42 పరుగులు) భారీగా పరుగులు ఇచ్చారు.

ఐపీఎల్ 2026లో టాప్ స్కోరు..

కేఎల్ రాహుల్, నితీష్ రాణా ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ చేసిన 254 పరుగులు, బెంగళూరు చేసిన 250 పరుగుల రికార్డులను అధిగమించి ఢిల్లీ అగ్రస్థానానికి చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?