AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS: ధోనీ రికార్డు బద్దలు కొట్టిన క్లాస్ ప్లేయర్.. ఐపీఎల్‌లో నయా చరిత్ర..!

Delhi Capitals vs Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం 13 పరుగులు సాధిస్తే, భారత దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న భారీ రికార్డును రాహుల్ అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

DC vs PBKS: ధోనీ రికార్డు బద్దలు కొట్టిన క్లాస్ ప్లేయర్.. ఐపీఎల్‌లో నయా చరిత్ర..!
Delhi Capitals Vs Punjab Kings Kl Rahul Records
Venkata Chari
|

Updated on: Apr 25, 2026 | 4:02 PM

Share

KL Rahul Break MS Dhoni Record: న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకమైనప్పటికీ, అందరి కళ్లు మాత్రం కేఎల్ రాహుల్ పైనే ఉన్నాయి. పంజాబ్ జట్టుపై రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. అలాగే ధోనీని వెనక్కి నెట్టి పరుగుల వేటలో పైకి చేరాడు.

ధోనీ భారీ రికార్డుకు ఎసరు..

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఆయన ఇప్పటివరకు 278 మ్యాచ్‌లలో 38.3 సగటుతో 5439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. అయితే, కేఎల్ రాహుల్ కేవలం 151 మ్యాచ్‌ల్లోనే 5427 పరుగులు చేసి ధోనీకి చేరువగా వచ్చాడు. నేటి మ్యాచ్‌లో రాహుల్ 13 పరుగులు చేసిన వెంటనే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ధోనీని వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరాడు. ప్రస్తుతం వార్త రాసే సమయానికి కేఎల్ రాహుల్ 17 పరుగులతో క్రీజులో నిలిచాడు.

కేఎల్ రాహుల్ అద్భుత గణాంకాలు..

రాహుల్ ఐపీఎల్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచారు. 45.61 సగటుతో పరుగులు సాధిస్తున్న రాహుల్ ఖాతాలో ఇప్పటికే 5 సెంచరీలు, 42 అర్థ సెంచరీలు ఉన్నాయి. కేవలం 151 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-7 బ్యాటర్లు:

విరాట్ కోహ్లీ: 274 మ్యాచ్‌లలో 8989 పరుగులు

రోహిత్ శర్మ: 276 మ్యాచ్‌లలో 7183 పరుగులు

శిఖర్ ధవన్: 222 మ్యాచ్‌లలో 6769 పరుగులు

డేవిడ్ వార్నర్: 184 మ్యాచ్‌లలో 6565 పరుగులు

సురేష్ రైనా: 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు

కేఎల్ రాహుల్: 151 మ్యాచ్‌లలో 5444 పరుగులు** (ప్రస్తుత మ్యాచ్‌లో వార్త రాసే సమయానికి 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.)

మహేంద్ర సింగ్ ధోనీ: 278 మ్యాచ్‌లలో 5439 పరుగులు

ధోనీ వంటి దిగ్గజం రికార్డును రాహుల్ అధిగమించడం అంటే అది మామూలు విషయం కాదు. తక్కువ మ్యాచ్‌ల్లోనే ఎక్కువ పరుగులు సాధిస్తూ దూసుకుపోతున్న రాహుల్, నేటి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. క్రికెట్ అభిమానులు ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం దర్శనం.. ఇక్కడికెళ్లారంటే కష్టాల..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం దర్శనం.. ఇక్కడికెళ్లారంటే కష్టాల..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే