AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS : ఢిల్లీ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. ఎండల్లో సెగలు పుట్టించే సమరం.. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఇదే

DC vs PBKS : ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు మొత్తం 34 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా ఇరు జట్లు చెరో 17 విజయాలతో సమంగా ఉన్నాయి.

DC vs PBKS : ఢిల్లీ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. ఎండల్లో సెగలు పుట్టించే సమరం.. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఇదే
Dc Vs Pbks
Rakesh
|

Updated on: Apr 25, 2026 | 1:18 PM

Share

DC vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు (శనివారం) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమే ఎరుగని పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేక్ వేయాలని అక్షర్ పటేల్ సేన భావిస్తోంది. అయితే, ఢిల్లీలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఆటగాళ్లకు సవాలుగా మారనున్నాయి.

అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి మ్యాచ్ పిచ్ నంబర్ 6పై జరగనుంది. సాధారణంగా ఇక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తాయి. చిన్న బౌండరీలు ఉండటంతో సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఇది మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది (దాదాపు 40 డిగ్రీలు). మ్యాచ్ గడిచేకొద్దీ పిచ్ నెమ్మదించి స్పిన్నర్లకు కాస్త సహకరించవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపవచ్చు, తద్వారా తీవ్రమైన ఎండలో ఫీల్డింగ్ చేసే ఇబ్బంది తప్పుతుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు

ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు మొత్తం 34 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా ఇరు జట్లు చెరో 17 విజయాలతో సమంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌తో ఏ జట్టు ఆధిక్యంలోకి వెళ్తుందో చూడాలి. పంజాబ్ ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, ఒకటి వర్షం వల్ల రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

బౌలర్లు వర్సెస్ బ్యాటర్లు

ఈ పిచ్‌పై సగటు స్కోరు 170.34గా ఉంది. ఇక్కడ అత్యధిక స్కోరు 278/3 కాగా, అత్యల్ప స్కోరు 66 పరుగులు. స్పిన్నర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (DC), యుజ్వేంద్ర చహల్ (PBKS) మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. బౌండరీ లైన్లు దగ్గరగా ఉండటం వల్ల పవర్ హిట్టర్లు అయిన శశాంక్ సింగ్ (PBKS), ట్రిస్టన్ స్టబ్స్ (DC)లకు ఇది కలిసొచ్చే అంశం.

తుదిజట్లు (అంచనా ప్లేయింగ్ 11)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): పథుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (wk), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మ, అక్షర్ పటేల్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి నటరాజన్.

పంజాబ్ కింగ్స్ (PBKS): ప్రియాన్ష్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ (wk), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us