AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్‌, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్‌, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది.

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
Kodandaram - Azharuddin
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2026 | 1:24 PM

Share

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్‌, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్‌, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది. గత ఏడాది ఆగస్ట్‌ 30న ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. అయితే అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది.

ఇప్పుడు గవర్నర్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరిస్థితి మారింది. ముఖ్యంగా అజారుద్దీన్‌ మంత్రి పదవి.. ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపైనే ఆధారపడి ఉండటంతో తాజా నిర్ణయంతో ఆయన మంత్రిగా కొనసాగడం స్పష్టమైంది.

స్వయంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. పదవిలో కొనసాగాలంటే ఏప్రిల్ 30 లోపు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఆరు నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది.. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇంతకాలం గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం పేర్లను పరిశీలించాలని.. గ్రీన్ సిగ్నన్ ఇవ్వాలని.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి సుధీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే.. వారి అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదించారు..

Follow Us
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్