AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ హీరోను జీవితంలో మర్చిపోలేను.. అడగ్గానే లక్ష సాయం చేశారు.. ప్రసాద్ బాబు..

నటుడు ప్రసాద్ బాబు తెలుగు సినీప్రియులకు సుపరిచితమే. వెండితెరపై అనేక సినిమాలు చేశారు. అలాగే బుల్లితెరపై ఎన్నో హిట్ సీరియల్స్ చేశారు. వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఓ స్టార్ హీరో అందించిన తోడ్పాటు, ఆర్థిక సహాయం, వ్యక్తిగత బంధం గురించి వివరించారు. ఆ హీరో తనకు ఎలా మళ్ళీ జీవితాన్ని ఇచ్చారో తెలియజేశారు.

Tollywood : ఆ హీరోను జీవితంలో మర్చిపోలేను.. అడగ్గానే లక్ష సాయం చేశారు.. ప్రసాద్ బాబు..
Prasad Babu
Rajitha Chanti
|

Updated on: Apr 25, 2026 | 5:31 PM

Share

ప్రముఖ నటుడు ప్రసాద్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో హీరోగా, విలన్ గా, సహయ నటుడిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. దశాబ్దాలుగా వెండితెర, బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, అలాగే మెగాస్టార్ చిరంజీవితో తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్ మొదలైనప్పటి నుండి నేటి వరకు చిరంజీవి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు అందించిన అండదండల గురించి వివరించారు. తన జీవితంలో చిరంజీవి పోషించిన కీలక పాత్రను పంచుకున్నారు. తన సినీ ప్రయాణంలో అత్యధికంగా చిరంజీవితోనే పనిచేశానని తెలిపారు. అయితే, మధ్యలో కొన్ని సినిమాలు చేయలేదని, ఎందుకంటే కొన్ని చిత్రాలకు 90 రోజుల డేట్స్ అడిగేవారని, అప్పుడు రోజుకు 1000 రూపాయల చొప్పున లక్ష రూపాయలు పారితోషికం అడిగితే నిర్మాతలు ఇవ్వలేదని, అందుకే ఆ చిత్రాలు కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. చిరంజీవి మాత్రం ఎప్పుడూ తనను నేరుగా అడగలేదని, తన పట్ల ఎప్పుడూ అహంకారం చూపించలేదని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య అవగాహన ఉండేదని, కథ నచ్చితే చేసేవాడినని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో దర్శకులు తనను నిర్లక్ష్యం చేయడం వల్ల అవకాశాలు లేక సతమతమవుతున్నప్పుడు, చిరంజీవి స్వయంగా దర్శకులకు చెప్పి “ఇతను నాకు మంచి ఆప్తుడు, మంచి నటుడు, నా సినిమాల్లో తనకి ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, తనేంటో మళ్లీ ప్రూవ్ చేసుకుంటాడు” అని తన కెరీర్‌కు మళ్లీ ఒక లైఫ్ ఇచ్చారని ప్రసాద్ బాబు అన్నారు. దీనికి రుద్రవీణ చిత్రం ఒక ఉదాహరణ అని, మొదట వేరొకరిని అనుకున్న పాత్ర తనకు వచ్చిందని, అది తాను బాగా చేయడంతోనే తనకు మోహన్ బాబు వంటి ఇతర హీరోల సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయని ఆయన వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

చిరంజీవి తనను ఎప్పుడూ ఒక ఆర్టిస్ట్‌లా చూడలేదని, సొంత తమ్ముడిలా చూసుకున్నారని ప్రసాద్ బాబు వెల్లడించారు. చిరంజీవి ఇంట్లో ఇది నా ఇల్లు అన్నట్టే వెళ్లి, తనకు కావాల్సిన టిఫిన్లు తినేంత చనువు ఉండేదని, ఇద్దరూ కలిసి వాకింగ్‌కు కూడా వెళ్లేవాళ్ళమని టీ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకున్నారు. తన ఫ్లాట్ కూడా చిరంజీవి పుణ్యమేనని ప్రసాద్ బాబు తెలిపారు. ఒకరోజు తన భార్య తన బావమరిదితో కలిసి ఒక ఫ్లాట్‌కు ముప్పై వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేసిందని, ఆ ఫ్లాట్ విలువ లక్షా ఎనభై వేలు అని, అప్పుడే తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని వివరించారు. డబ్బులు ఎక్కడ నుండి తెస్తానని ఆ రాత్రంతా నిద్ర పట్టలేదని, లక్ష రూపాయలు అప్పు చేయాలంటే మహా భయమని, ఎలా తీరుస్తానని ఆలోచించేవాడినని చెప్పారు. ఆ రాత్రి నిద్రలో అనుకోకుండా చిరంజీవి కనిపించడంతో, దేవుడే చూపించాడేమో అని ఆయన ఇంటికి వెళ్ళానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

చిరంజీవిని కలిసి లక్ష రూపాయలు కావాలని అడగగా, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్లి కవర్‌లో లక్ష రూపాయలు పెట్టి ఇచ్చేశారని, ఆ రోజుల్లో అది చాలా పెద్ద విషయమని ప్రసాద్ బాబు ఆశ్చర్యంగా గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆ లక్ష రూపాయలను ఫ్లాట్ యజమానికి ఇచ్చి, మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తానో తెలియదని చెప్పానని పేర్కొన్నారు. యజమాని “మీరు గట్టిగా ట్రై చేస్తే ఇలాంటివి చాలా కొంటారు” అని అన్నారని, ఆ మాట తనకు మరింత ప్రేరణనిచ్చిందని చెప్పారు. అప్పటినుండి చిరంజీవికి లక్ష రూపాయలు, యజమానికి యాభై వేలు ఎలా తీర్చాలో అని నిద్రలేకుండా ఆలోచించానని, ఆ రోజులు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివని ప్రసాద్ బాబు వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

Follow Us