AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టకూటి కోసం బిగ్రేడ్ సినిమాల్లో నటించా.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది.. ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ.. ఉంటారు. కొంతమంది అవకాశాలు అందుకున్నా కూడా కొంతమంది మాత్రం మధ్యలో అవకాశాలు కోల్పోతూ ఉంటారు. అవకాశాలు తగ్గిపోవడంతో ఇతర పనులు చేస్తూ ఉంటారు. అలాగే స్టార్ డమ్ తగ్గిపోయి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటారు.

పొట్టకూటి కోసం బిగ్రేడ్ సినిమాల్లో నటించా.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2025 | 7:40 PM

Share

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అవకాశాలు రావడమే చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు. ఇక కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం అవకాశాలు తగ్గడంతో వేరే పనులు చేస్తున్నారు. ఇంకొంతమంది స్టార్ డమ్ సొంతం చేసుకున్నవారు అవకాశాలు తగ్గడంతో చిన్న చిన్న పాత్రలు చేయడం.. చిన్న సినిమాల్లో నటించడంలాంటివి చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ నటుడు అవకాశాలు తగ్గిపోవడంతో బిగ్రేడ్ సినిమాల్లో నటించాడు. దాంతో ఆయన పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. దీని పై ఆయన క్లారిటీ ఇచ్చారు. పొట్టకూటి కోసమే అలా బీ గ్రేడ్ సినిమాల్లో నటించాల్సి వచ్చింది అని తెలిపాడు. ఆ నటుడు ఇంతకూ ఆ టాలీవుడ్ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

ఇది కూడా చదవండి : అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించాడు. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్‌గా అతడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. మొన్నామధ్య లేటు వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచారు. 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో బీ గ్రేడ్ సినిమాల్లో నటించాను అని తెలిపారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తితో కలిసి బి గ్రేడ్ చిత్రాలలో కూడా నటించాను అని చెప్పారు. ఆ సమయంలో అవకాశాలు రాలేదు. దాంతో ఆదాయం తగ్గిపోయింది. పొట్టకూటి కోసం ఆ సినిమాలు చేయక తప్పలేదు అని చెప్పాడు. అలాగే ఆ సినిమాల్లో నటించడం నాకు తీవ్రమైన బాధను కలిగించింది. కానీ ఏం చేద్దాం.. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచలేదు. వేరే సినిమాలలో అవకాశాలు రాలేదు అని చెప్పుకొచ్చారు ఆశిష్ విద్యార్థి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్