Vijayakanth: కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆందోళనలో అభిమానులు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకులు కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకులు కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో బుధవారం (నవంబర్ 29) ఆస్పత్రి వైద్యులు విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘విజయకాంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేదు. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. కెప్టెన్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. చికిత్సలో భాగంగా ఆయన ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది’ అని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అదే సమయంలో ఆయన సతీమణి ప్రేమలతా విజయ్‌కాంత్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ‘కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారు. అందరినీ కలుసుకుంటారు’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
సుమారు రెండు వారాల క్రితం (నవంబర్ 18) దగ్గు, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు విజయ్‌కాంత్. లివర్ లో కూడా సమస్యలు తలెత్తడంతో ఆ దిశగా చికిత్స ప్రారంభించారు వైద్యులు. అప్పటినుంచే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు కెప్టెన్. మరోవైపు విజయ్ కాంత్‌ఆరోగ్యంపై ఆయన అభిమానులు, డీఎండీఎండీకే నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కెప్టెన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ వయసు 70 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ఆయన పరిస్థితి బాగా విషమించింది. డయాబెటిస్ కారణంగా కెప్టెన్ కుడికాలి మూడు వేళ్లని తొలగించారు వైద్యులు. విదేశాల్లో కూడా చికిత్స అందించారు. విజయ్‌కాంత్ ఎక్కువగా ఆస్పత్రిలోనే ఉండడంతో పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి ప్రేమ లతా విజయ్ కాంత్ చూసుకుంటున్నారు.
విజయ్ కాంత్ సతీమణి రిలీజ్ చేసిన వీడియో
கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார்.
– திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG
— Vijayakant (@iVijayakant) November 29, 2023
కెప్టెన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు
உடல்நலக்குறைவால் மருத்துவமனையில் தொடர் சிகிச்சை பெற்று வரும் தே.மு.தி.க தலைவர் திரு.@iVijayakant அவர்கள் பூரண உடல் நலம் பெற்று இல்லம் திரும்ப எல்லாம் வல்ல இறைவனை பிரார்த்திக்கின்றேன்.
Wishing you a speedy recovery, Captain #Vijayakanth 💐 pic.twitter.com/HQIdNlgBqf
— Dr C Vijayabaskar (@Vijayabaskarofl) November 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




