Akkineni Nagarjuna: తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు.. అఖిల్, నాగచైతన్య సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున.. అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

అక్కినేని నాగార్జున దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అక్కినేని నాగార్జున.. అమల దంపతులు కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జున అఖిల్ నటించిన ఏజెంట్.. నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“ఏడాది కాలం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా అబ్బాయిల సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాము” అని అన్నారు నాగార్జున. అఖిల్ నటించిన ఏజెంట్.. చైతూ నటించిన కస్టడీ చిత్రాలు ఘన విజయం సాధించాలని శ్రీనివాసుడిని కోరుకున్నానని తెలిపారు అమల.




ఇదిలా ఉంటే.. నాగార్జున చివరిసారిగా ఘోస్ట్ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత నాగ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు నాగ్.




