Aishwarya Rai: మణిరత్నం కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య.. అందాల తార సంస్కారానికి అభిమానులు ఫిదా.. వైరల్ వీడియో
సినిమాల్లోనూ యువరాణిగా వెలుగొందింది ఐష్. దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది ఆమె తత్వం. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఐష్ ఎంతో సింప్లిసిటీతో లైఫ్‌ను లీడ్ చేస్తారామె. గతంలో పలు సందర్భాల్లో ఇది రుజువైంది.

ఐశ్వర్యరాయ్.. ఈ అమ్మడి అందానికి మన దేశమే కాదు ప్రపంచమే ఫిదా అయ్యింది. అందుకే ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటం ఆమె సొంతమైంది. ఇక సినిమాల్లోనూ యువరాణిగా వెలుగొందింది ఐష్. దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది ఆమె తత్వం. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి ఇంట కోడలిగా అడుగుపెట్టిన ఐష్ ఎంతో సింప్లిసిటీతో లైఫ్‌ను లీడ్ చేస్తారామె. గతంలో పలు సందర్భాల్లోనూ ఇది రుజువైంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం పాదాలకు ఐష్ నమస్కరించారు. ఆమె నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్‌లో భాగంగా ఆ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఐశ్వర్య సంస్కారానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు (ఇరువర్) సినిమాతోనే ఐష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఐష్- మణి కాంబినేషన్‌లో ‘గురు’, ‘రావణ్’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్‌తో మరోసారి ఈ కాంబో రిపీటైంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మణిరత్నం ను గురువుగా భావిస్తారు ఐష్. ఈక్రమంలోనే తాజాగా ఆయన పాదాలకు నమస్కరించి తన కృతజ్ఞతా భావాన్ని చాటుకుంది. పొన్నియన్ సెల్వన్2 ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన మణిరత్నం.. ‘పొన్నియన్ సెల్వన్‌లో ‘నందిని’ పాత్రకు ఐశ్వర్య అయితేనే న్యాయం చేస్తుందనిపించింది. ఆమెను అడిగిన వెంటనే అంగీకరించింది అని చెబుతుండగానే.. ఐశ్వర్య ఎమోషనల్ అయ్యింది. వెంటనే స్టేజ్‌పై నుంచి లేచి అందరి ముందు మణిరత్నం పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




