Samantha: నేను గట్టిగా మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటుంది.. సమంతకు చిట్టిబాబు కౌంటర్
సామ్ ఇచ్చిన కౌంటర్‌కు అంతే గట్టిగా రిప్లై ఇచ్చారు చిట్టిబాబు. తాను గట్టిగా మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారని కామెంట్ చేశారు. తాను నోరు విప్పితే సమంత పరువు పోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం వివాదం ఏంటో తెలుసుకుందాం పదండి.

సౌత్ ఇండియా టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రజంట్ నెట్టింట్ తెగ ట్రెండ్ అవుతున్నారు. సమంతకు.. నటుడు, నిర్మాత చిట్టిబాబుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాస్త లెవల్ తగ్గి మరీ ఒకరినొకరు విమర్శించుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఎప్పుడూ కూల్గా…ఫన్నీగా తన పనేదో .. తాను చూసుకుంటూ వెళ్లిపోయే సమంత గురించి పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేశారు నటుడు, ప్రొడ్యూసర్ చిట్టిబాబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిట్టిబాబు మాట్లాడుతూ, “హీరోయిన్‌గా సమంత కెరీర్ అయిపోయిందని, మళ్లీ స్టార్‌డమ్‌ను అందుకోలేకపోతోందని… తనకు వచ్చిన ఆఫర్లను చేస్తూనే తన ప్రయాణాన్ని కొనసాగించాలని” అన్నాడు. అంతేకాదు సానుభూతి పొందేందుకు” సమంత ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ప్రతిసారీ సెంటిమెంట్ పనిచేయదు. పాత్ర, సినిమా బాగుంటే జనాలు చూస్తారు. కథానాయిక హోదాను కోల్పోయిన సమంత శకుంతల పాత్రకు ఎలా సూట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇవన్నీ చౌకబారు, పిచ్చి పనులు. నాకు శాకుంతలం మీద ఆసక్తి లేదు” అని చిట్టిబాబు వ్యాఖ్యానించారు.
అతని మాటలను చాలాకాలం లైట్ తీసుకున్న సామ్.. తాజాగా సెటైరికల్ పోస్ట్ పెట్టింది. చిట్టిబాబు పేరు మెన్షన్ చేయకుండా.. ఆయన గురించి ఇన్ స్టాలో ఓ స్టోరీని వదిలింది. చెవిలో వెంట్రుకలు ఎందుకొస్తాయని గూగుల్‌ని అడిగితే టెస్టోస్టిరాన్ లెవల్స్ ఎక్కువ వుంటే వస్తాయని బదులిచ్చిందంటూ ఆమె ఓ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఇండైరెక్ట్‌గా చిట్టిబాబు.. ఆయన చెవికి ఉన్న వెంట్రుకలపై సెటైర్ వేశారు సామ్.

Sam Insta Story
ఇక సమంత చేసిన ఈ సెటైరికల్ పోస్ట్ పై చాలా సీరియస్‌గా రియాక్టయ్యారు చిట్టిబాబు. ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారని.. అదే తాను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదంటూ తాజాగా సమంత కామెంట్స్ పై సీరియస్ అయ్యారు చిట్టిబాబు. తన పేరు ఎత్తలేదు కాబట్టి తాను కూడా వారి పేరు చెప్పడం లేదంటూనే.. తన చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు, తన మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేదని సమంతకు చురక అంటించారు.
అంతేకాదు తాను నోరు విప్పితే సమంత పరువు పోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలా సమంత చేసిన సెటైరికల్ పోస్ట్‌పై … తన స్టైల్లో చాలా తీవ్రంగా రియాక్టయ్యారు. ఇప్పుడీ కామెంట్స్‌తో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి చిట్టిబాబు కౌంటర్ మాటలకు సామ్ ఎలా రియాక్టయ్యావుతారో.. తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
