AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కళ్లల్లో ఆనందాన్ని నింపిన అడివి శేష్.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు

టాలీవుడ్ మోస్ట్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో ఆ తర్వాత ఫుల్ యాక్టర్‌గా మారాడు. కేవలం నటనే కాదు డైరెక్షన్ అండ్ రైటింగ్ లోనూ సత్తా చాటుతున్నాడు. టాలీవుడ్ లో మల్టీపుల్ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు

Adivi Sesh: క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కళ్లల్లో ఆనందాన్ని నింపిన అడివి శేష్.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు
Adivi Sesh
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 6:39 AM

Share

టాలీవుడ్ మోస్ట్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో ఆ తర్వాత ఫుల్ యాక్టర్‌గా మారాడు. కేవలం నటనే కాదు డైరెక్షన్ అండ్ రైటింగ్ లోనూ సత్తా చాటుతున్నాడు. టాలీవుడ్ లో మల్టీపుల్ ట్యాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌ లోనూ తన గొప్ప మనసు చాటుకున్నాడీ హీరో. తద్వారా రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కీర్తి అనే చిన్నారి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది. ఆమెకు చిన్నప్పటి నుండి హీరో అడివి శేష్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం తెలుసుకున్న శేష్ చిన్నారి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. అవసరమైనప్పుడు పాపకు తన సపోర్ట్ కచ్చితంగా ఉంటుందని భరోసా ఇచ్చాడు. నిత్యం కీర్తి తల్లిదండ్రులు, పాపతో టచ్ లో ఉంటున్న అడివి శేష్ తాజాగా వారికి ఒక సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్ ని ప్లాన్ చేసి, అక్కడ చిన్నారిని కలిశాడు. రోజంతా తనతో గడిపాడు. పాప ఫొటోలు చూసి మురిసిపోయాడు. తనతో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పాడు. కలిసి ఆడాడు, పాడాడు. చిన్నారికి ఇష్టమైన బొమ్మలతో ఆటలాడించాడు. పాపను ఎత్తుకుని ఆనందంలో ముంచెత్తేలా చేశాడు. అలాగే కీర్తి తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు

ఇక అడవి శేష్ రాగానే.. ఎంతో సంబరపడిపోయింది ఈ చిన్నారి. తనకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి సంతోషంగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. క్యాన్సర్ తో బాధపడుతోన్న చిన్నారి ముఖంలో చిరు నవ్వులు నింపిన అడివిశేష్ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘చాలా మంచి పని చేశావయ్యా’, ‘మీరు రియల్ హీరో సార్’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ బాధిత చిన్నారితో హీరో అడివి శేష్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Actor Adivi Sesh Fulfils Dream Of Little Girl battling Cancer, Watch Heartwarming Video