- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies pushpa 02, Kannappa, game changer, salaar 02 movie are ready to release in december 2024
టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..
ఈ డిసెంబర్‌లో గేమ్ చేంజర్ రానుందా? ఈ డిసెంబర్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్‌గా మారనుందా? ఆ నెల్లోనే రాజా సాబ్ థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారా? పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా? లేదా? ...ఈ డౌట్ వల్ల క్రియేట్ అవుతున్న ఈ కన్‌ఫ్యూజన్‌కి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు? అనౌన్స్ చేసిన టైమ్‌కి పక్కాగా ల్యాండ్ అయితే డిసెంబర్ 6న థియేటర్లలో పుష్పరాజ్ అసలు తగ్గేదేలే మేనరిజాన్ని విట్‌నెస్ చేయొచ్చు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా?
Updated on: Jul 20, 2024 | 9:53 PM

ఈ డిసెంబర్‌లో గేమ్ చేంజర్ రానుందా? ఈ డిసెంబర్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్‌గా మారనుందా? ఆ నెల్లోనే రాజా సాబ్ థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారా? పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా? లేదా? ...ఈ డౌట్ వల్ల క్రియేట్ అవుతున్న ఈ కన్‌ఫ్యూజన్‌కి ఫుల్‌స్టాప్ పడేదెప్పుడు?

పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో.. ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో వేచి చూస్తుంది. ఇండియన్ సినిమాలో నెక్ట్స్ 1000 కోట్ల సినిమా ఇదే అంటూ అంచనాలు పెంచేస్తున్నారు.

మా సినిమా డిసెంబర్‌లో వచ్చేస్తుంది అని గట్టిగా చెప్పారు మంచు విష్ణు. పుష్పరాజ్ రాకపోతే ఆ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవడానికి చాలా సినిమాలే సన్నద్ధమవుతున్నాయంటున్నారు క్రిటిక్స్.

భారతీయుడు 2 సినిమా మార్నింగ్ షోతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో, పూర్తి నమ్మకాన్ని గేమ్‌ఛేంజర్ మీదే పెట్టుకున్నారు శంకర్.

ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.




