- Telugu News Photo Gallery Cinema photos Kollywood heroes dhanush dulquer salmaan vijay focusing on tollywood
తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??
తెలుగు భాష లెక్క... ఆడా ఉంటా... ఈడా ఉంటా అనే డైలాగ్‌ని ఈ మధ్య పొరుగు హీరోలు కొందరు పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. ఆల్రెడీ తమకు మార్కెట్ ఉన్న ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ యంగ్ తరంగ్ అనిపిస్తున్న హీరోలు ఎవరెవరు? ధనుష్ ఇప్పుడు కెరీర్‌లో కీ ఫేజ్‌లో ఉన్నారు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకుంటూ, డైరక్షన్ చేస్తూ, నార్త్ - సౌత్ తేడా లేకుండా అన్నీ చోట్లా మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ యమాబిజీగా ఉన్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jul 20, 2024 | 9:50 PM

తెలుగు భాష లెక్క... ఆడా ఉంటా... ఈడా ఉంటా అనే డైలాగ్‌ని ఈ మధ్య పొరుగు హీరోలు కొందరు పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. ఆల్రెడీ తమకు మార్కెట్ ఉన్న ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ యంగ్ తరంగ్ అనిపిస్తున్న హీరోలు ఎవరెవరు?

ధనుష్ ఇప్పుడు కెరీర్‌లో కీ ఫేజ్‌లో ఉన్నారు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకుంటూ, డైరక్షన్ చేస్తూ, నార్త్ - సౌత్ తేడా లేకుండా అన్నీ చోట్లా మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ యమాబిజీగా ఉన్నారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఆయన టాలీవుడ్ మీద ఫోకస్ చెదరకుండా చూసుకుంటున్నారు. సార్ సినిమాతో తెలుగులో వచ్చిన హిట్ సౌండ్ అంతలా నచ్చింది ఆయనకు.

ఆ కిక్‌తోనే ఇప్పుడు కుబేర సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున, ధనుష్ నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌లాగానే తెలుగు ప్రొడ్యూసర్‌కి కాల్షీట్ ఇచ్చి వారసుడు చేశారు విజయ్. ఇకపై వరుసగా తెలుగు మేకర్స్ తో మింగిల్ అవుతారనుకున్న తరుణంలో సినిమాకు స్వస్తి చెప్పబోతున్నానంటూ షాక్ ఇచ్చారు.

ఆ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవడానికి కోలీవుడ్ నుంచి ముందడుగేశారు అజిత్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో గుడ్‌బ్యాడ్ అగ్లీ చేస్తున్నారు తల. తమిళ్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు మలయాళం స్టార్స్. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్‌లో చేస్తున్న సినిమాలకన్నా తెలుగులో చేస్తున్న సినిమాల సంఖ్యే భారీగా కనిపిస్తోంది. కల్కిలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ స్టార్, త్వరలోనే లక్కీ భాస్కర్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

యంగ్‌స్టర్స్ లో దుల్కర్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ఫాహద్ కూడా తెలుగు మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సీనియర్లలో మమ్ముట్టి, మోహన్‌లాల్ టాలీవుడ్ టచ్ పోకుండా చూసుకుంటున్నారు. తమకు సెట్ అయ్యే కథ కాలింగ్ బెల్ నొక్కితే, పర్ఫెక్ట్ గా రియాక్ట్ అవుతున్నారు ఈ ఆర్టిస్టులు. రోల్ మెయిన్ అయినా, సైడ్ అయినా... నో చెప్పకుండా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఈ స్టార్స్.





























