- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actor Gulshan Devaiah Says About work with Janhvi Kapoor
Janhvi Kapoor: జాన్వీకి నాకు మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదు.. బాలీవుడ్ హీరో కామెంట్స్..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో తొలిసారి వర్క్ చేయడంపై బీటౌన్ నటుడు గుల్షన్ దేవయ్య స్పందించారు. సెట్ లో తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు. చిత్రీకరణ సమయంలో మా మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదని అన్నారు. కేవలం ప్రొఫెషనల్స్ గా పనిచేసేవాళ్లమని.. సెట్ కి వెళ్లేవాళ్లమని.. డైరెక్టర్ చెప్పిన విధంగా వర్క్ చేసేవాళ్లమంతే తప్ప.
Updated on: Jul 20, 2024 | 9:32 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో తొలిసారి వర్క్ చేయడంపై బీటౌన్ నటుడు గుల్షన్ దేవయ్య స్పందించారు. సెట్ లో తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు. చిత్రీకరణ సమయంలో మా మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదని అన్నారు.

కేవలం ప్రొఫెషనల్స్ గా పనిచేసేవాళ్లమని.. సెట్ కి వెళ్లేవాళ్లమని.. డైరెక్టర్ చెప్పిన విధంగా వర్క్ చేసేవాళ్లమంతే తప్ప.. జోక్స్ వేసుకోవడం.. సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేయలేదని అన్నారు.

సాధారణంగా ఒక ప్రాజెక్టులో పనిచేసే నటీనటులు సరదాగా మాట్లాడుకుంటారని.. ఇష్టాయిష్టాలు షేర్ చేసుకుంటారని.. ఆ పరిచయంతో నటీనటుల మధ్య స్నేహం పెరుగుతుందని.. అది స్క్రీన్ మీద వర్కౌట్ అవుతుందని అన్నారు.

కానీ జాన్వీతో తనకు ఎలాంటి ఫ్రెండ్ షిప్ లేదని.. అయినా దర్శకుడికి కావాల్సిన విధంగా వర్క్ చేశామని అన్నారు జాన్వీ మంచి నటి అని.. పాత్ర పరిధి మేరకు చక్కగా నటిస్తుందని అన్నారు. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ ఉలఝ్.

సుధాన్షు సరియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ జోడిగా దేవర చిత్రంలో నటిస్తుంది.




