- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Raviteja's Kick Movie Ileana Sister Aasheekaa Bathija, Latest Photos Goes Viral
Aasheekaa Bathija: అయ్యా బాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ సినిమా హీరోయిన్.. ఏ మూవీలో నటించిందంటే..
టాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. కానీ తమ గుర్తింపును నిలబెట్టుకోవడంలో మాత్రం కొందరు తారలు విఫలమవుతుంటారు. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతుంటారు. అందులో ఆషికా బతిజా. ఆషికా బతిజా.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు.
Updated on: Jul 20, 2024 | 8:45 PM

టాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. కానీ తమ గుర్తింపును నిలబెట్టుకోవడంలో మాత్రం కొందరు తారలు విఫలమవుతుంటారు. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతుంటారు. అందులో ఆషికా బతిజా..

ఆషికా బతిజా.. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ రవితేజ నటించిన కిక్ సినిమాలో ఇలియానాకు చెల్లెలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా కిక్ సినిమాతో అడియన్స్ కు దగ్గరయ్యింది ఆషికా. ఈ బ్యూటీకి సంబంధించి వివరాలు అంతగా తెలియదు.

కానీ కిక్ సినిమాతోనే ఈ బ్యూటీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు కానీ.. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది.

గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆషికా.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన ఆషికా.. సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టినట్లులేదు.

కానీ ఆమె సోషల్ మీడియా ఖాతాలో మాత్రం మోడర్న్ ఫోటోస్ షేర్ చేస్తుంది. చాలా కాలం తర్వాత ఈ బ్యూటీని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు సన్నజాజిలా ఉన్న ఆషికా.. ఇప్పుడు బొద్దుగా మారిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.





























