- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan may debut daughter Suhana Khan in bollywood with Abhishek Bachchan as Villain Telugu Actress Photos
Suhana Khan: కూతురు కోసం షారూక్ కష్టం.! వావ్.. ఇండస్ట్రీకి మరో సూపర్ హీరోయిన్ సుహానా.!
పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన షారూఖ్ ఖాన్, నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. కూతురితో కలిసి భారీ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ కింగ్ పేరుతో ఓ సినిమాను ఓకే చేసిన షారూఖ్, ఆ సినిమా కోసం ప్రీపేర్ అవుతున్నారు.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Jul 20, 2024 | 9:03 PM

డంకీ రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న షారూఖ్ ఖాన్ త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ తన కూతురితో కలిసి నటిస్తుండటంతో అప్ కమింగ్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు బాద్‌షా. ఈ సినిమాలో విలన్‌గా ఓ టాప్ స్టార్‌ను రంగంలోకి దించుతున్నారు.

పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన షారూఖ్ ఖాన్, నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కూతురు సుహానాను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు.

కూతురితో కలిసి భారీ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ కింగ్ పేరుతో ఓ సినిమాను ఓకే చేసిన షారూఖ్, ఆ సినిమా కోసం ప్రీపేర్ అవుతున్నారు.

కూతురు డెబ్యూ మూవీ కావటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కింగ్ ఖాన్. స్క్రిప్ట్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ముందు ఈ సినిమాలో విలన్‌గా ఓ సౌత్ స్టార్ హీరోను తీసుకోవాలని భావించారు షారూక్.

అయితే ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో బాలీవుడ్ హీరోనే రంగంలోకి దించుతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న అభిషేక్ బచ్చన్‌తో వార్‌కు రెడీ అవుతున్నారు బాద్‌షా.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్సే చేస్తున్న అభిషేక్ బచ్చన్చ, కింగ్‌లో విలన్‌గా చేయడానికి ముందు కాస్త ఆలోచించారట. కానీ దర్శకుడు సుజయ్ ఘోష్ కథ చెప్పిన విధానం నచ్చి ఫైనల్‌గా ఓకే చేశారు.





























