AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abbas: ఆ అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..బైక్‌ మైకానిక్‌గా పనిచేశా: ‘ప్రేమదేశం’ అబ్బాస్‌

90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా యూత్‌ను ఒక ఊపు ఊపింది. ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈమూవీ అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో నటించిన అబ్బాస్‌, టుబు, వినీత్‌ ఓవర్‌నైట్‌లో స్టార్లుగా మారిపోయారు. ముఖ్యంగా అబ్బాస్ అయితే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.

Abbas: ఆ అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..బైక్‌ మైకానిక్‌గా పనిచేశా: 'ప్రేమదేశం' అబ్బాస్‌
Abbas Family
Basha Shek
|

Updated on: Jul 20, 2023 | 8:02 AM

Share

90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా యూత్‌ను ఒక ఊపు ఊపింది. ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈమూవీ అప్పట్లో పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో నటించిన అబ్బాస్‌, టుబు, వినీత్‌ ఓవర్‌నైట్‌లో స్టార్లుగా మారిపోయారు. ముఖ్యంగా అబ్బాస్ అయితే అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఇక అబ్బాస్‌ కటింగ్‌కు అయితే యూత్‌ అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో నటించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్. అయితే తెలుగులో మాత్రం సెకెండ్‌ హీరోగానే కనిపించాడు. క్రమంగా అవకాశాలు సన్నగిల్లడంతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు.ఇటీవల మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేశాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇద్దామనుకుంటున్న అబ్బాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌లోని చేదు అనుభవాలను అందరితో పంచుకున్నాడు.

ఫ్యామిలీని పోషించేందుకు..

‘నేను ప్రైవేట్ పర్సన్‌ని. సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉంటాను. అయితే కొవిడ్‌ సమయంలో జూమ్‌ ద్వారా అభిమానులకు మళ్లీ చేరువయ్యాను. నేను అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చేశాను. 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమా పరిశ్రమను ఒక మార్గంగా ఎంపిక చేసుకున్నాను. ప్రారంభంలో బాగానే ఉంది. కానీ.. క్రమంగా అపజయాలు ఎదురయ్యాయి. కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. దీంతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాను. అక్కడ ఫ్యామిలీని పోషించేందుకు బైక్‌ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గానూ వర్క్‌ చేశాను.’

అమ్మాయి దూరం కావడంతో..

‘టీనేజ్‌లోనూ నా లైఫ్‌ గందరగోళంగానే గడిచింది. 10వ తరగతిలో తప్పినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో బలవన్మరణ ఆలోచన మరింత బలపడింది. ఒకసారి రోడ్డు మధ్యలో భారీ వాహనం ముందుకు వెళ్లానుకున్నా. అయితే నా వల్ల ఎదుటివారు ఇబ్బంది పడడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే సూసైడ్‌ ఆలోచనను విరమించుకున్నా’ అని పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నాడు అబ్బాస్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.